Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భరత్ అనే నేను'': మహేష్ కోసం పాటపాడిన బాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ''భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్లు కూడా ప్రారంభమయ్యాయి

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (12:05 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ''భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్లు కూడా ప్రారంభమయ్యాయి. 
 
ఇప్పటికే ఫస్ట్ లుక్‌లతో పాటు మొదటి పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్. ఏప్రిల్ 1న మరో పాటను విడుదల చేయబోతోంది. ఈ పాటను ఎవరు పాడారో తెలుసా.. బాలీవుడ్ హీరో. ఐ డోన్డ్ నో అంటూ సాగే ఈ సాంగ్‌ను ఎవరు పాడారో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ట్విట్టర్లో పెట్టారు.
 
ప్రముఖ బాలీవుడ్ హీరో, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్ ఈ పాటను ఆలపించారు. హిందీలో పలు పాటలను పాడిన ఫర్హాన్‌ మొదటి సారిగా దక్షిణాది భాషలలో ''భరత్‌ అనే నేను'' కోసం పాడారు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన వీడియోను కూడా దేవీశ్రీప్రసాద్ విడుదల చేశారు. 
 
ఆ వీడియోలో "ఫర్హాన్ అనే నేను, ఫస్ట్ టైమ్ తెలుగులో భరత్ అనే నేనుకు పాడాను. మీకు నచ్చుతుందని భావిస్తున్నా" అంటూ ఫర్హాన్ తెలిపాడు.  మరి ఈ పాటను వినాలంటే ఏప్రిల్ 1వరకు వేచి చూడాల్సింది. ఇక ఏప్రిల్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments