Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త రూల్స్‌కు ఫేస్‌బుక్ గ్రీన్ సిగ్నల్ .. ముగిసిన ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’ గడువు

Webdunia
బుధవారం, 26 మే 2021 (08:37 IST)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త రూల్స్‌కు పచ్చజెండా ఊపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో దేశీయంగా ఎఫ్.బి సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. 
 
నిజానికి దేశీయ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సేవలు బుధవారం నుంచి నిలిచిపోనున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. సామాజిక, డిజిటల్‌ మాధ్యమాల్లోని కంటెంట్‌ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’ పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. 
 
వీటికి సంబంధించి యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడంచెల్లో గ్రీవెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోవాలని కంపెనీలకు సూచించింది. దీని కోసం మే 25ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. 
 
అయితే ప్రముఖ సామాజిక దిగ్గజాలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫిర్యాదుల పరిష్కారానికి భారతీయ అధికారులను నియమించడం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను గుర్తించే పర్యవేక్షణ, మెకానిజమ్‌ను ఆయా సంస్థలు ఇంకా ఏర్పాటు చేసుకోలేదని పేర్కొన్నాయి. 
 
దీంతో బుధవారం నుంచి సోషల్‌ మీడియా సైట్లు, ఓటీటీలు బంద్‌ అవుతాయా? అన్న చర్చ మొదలైంది. కానీ, కేంద్రం తెచ్చిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ రూల్స్‌కు వాట్సాప్‌తో పాటు.. ఫేస్‌బుక్‌ కూడా ఆమోదం తెలిపాయి. ఫలితంగా వీటి సేవలకు ఎలాంటి అంతరాయం సాగిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments