కర్ణాటకలో కళ్లు తెరిచిన శివుడు.. అంతా మంచికేనట..

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (09:15 IST)
కర్ణాటకలో శివుడు కళ్లు తెరిచాడు. కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని…చిక్కోడి నియోజకవర్గంలోని గోకాకలోని ఓ ఆలయంలో శివుడు కళ్లు తెరిచాడు. అది చాలా శుభపరిణామం అనీ.. ఇక అంతా మంచే జరుగుతుందని అంటున్నారు ఆలయ పూజారి. శివలింగం కళ్లు తెరవటం ఇది మొదటిసారికాదని గతంలో కూడా శివలింగానికి ఉన్న కళ్లు తెరుచుకున్నాయని ఇదంతా మంచికేనని అంటున్నారు ఆలయ పూజారి.
 
బెల్గాం జిల్లాలోని గోకాకలో పరమేశ్వరుడి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న శివలింగం కళ్లు తెరిచింది. ఈ విషయం తెలిసిన భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
 
కాగా.. ప్రతీరోజు లాగానే పూజారి ఉదయాన్నే శివయ్య స్వామికి పూజా కార్యక్రమాన్ని యధావిధిగా జరిపించి.. అన్నీ ముగించుకొని బయటకు వెళ్లారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే రాజేశ్వరి భూతీ అనే మహిళా భక్తురాలు స్వామివారిని దర్శించుకోటానికి వచ్చారు. దర్శనం కోసం ఆలయానికి వెళ్లి…శివలింగాన్ని దర్శించుకుంటూ కళ్లారా శివయ్యను చూస్తు ఉంది.
 
అలా చూస్తున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. షాక్ అయ్యింది. శివలింగానికి ఉన్న కళ్లు తెరుచుకుని అచ్చం మనిషిలా చూస్తున్నట్లుగా అనిపించింది. ఈ దేవాలయంలో శివలింగానికి ఇలా కళ్లు తెరచుకోవడం ఇది రెండోసారి. 
 
2004లో తొలిసారి ఇలా జరిగిందనీ..అలా జరిగిన తరువాత ప్రపంచానికి మేలు జరిగిందనీ… మళ్లీ ఇప్పుడు అదే విధంగా జరిగింది కాబట్టి… మంచే జరుగుతుందని తెలిపారు. కాగా.. ప్రస్తుతం శివలింగం కళ్లు మళ్లీ మూసుకుపోయినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments