గద్దలు, డేగలు ఆహారం పట్టుకునేందుకు గాల్లోంచి నేలమీదకు భారీ వేగంతో దూసుకువస్తాయట. డేగలు చాలా జంతువులు, పక్షులకన్నా ఎక్కువ రంగులను గుర్తిస్తాయి. కళ్లుమూసి తెరిచేలోపే భూమిపై ఉన్న కోళ్లు, పక్షులను ఎత్తుకెళ్తాయి. తాజాగా సముద్ర తీరంలో డ్రోన్ కెమెరాతో వీడియో తీస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ పేద్ద డేగ కెమెరాను ఎత్తుకెళ్లింది. డేగ.. డ్రోన్‌తో వెళ్తుండగా రికార్డు అయిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
37 సెకండ్ల పాటు ఉన్న వీడియోలో డ్రోన్ బీచ్‌ను చిత్రీకరించి తీరం వైపు వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తున్నది. అది పక్షి అనుకుందో ఏమోగానీ.. సముద్రతీరం నుంచి సమీపంలోని అడవివైపు వెళ్లగా కొద్దిసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. ఆ వీడియోలో డేగ నీడ కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సరదా కామెంట్లు చేస్తున్నారు.