Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి హరికృష్ణ దుర్మరణం.. కారు ప్రమాదం ఎలా జరిగిందంటే...

సినీ హీరో, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగినపుడు కారును ఆయనే స

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (09:22 IST)
సినీ హీరో, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగినపుడు కారును ఆయనే స్వయంగా నడుపుతుండగా, కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. దీంతో ప్రమాదం జరిగినట్టు నల్గొండ ఎస్పీ రంగనాథ్ వివరించారు. ఈ ప్రమాద వివరాలను ఆయన వివరించారు.
 
నెల్లూరు జిల్లా కావలిలో జరిగే తన అభిమాని ఇంట పెళ్లి కోసం ఆయన బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కావలికి తన సొంత కారు ఫార్చ్యూన్‌లో బయలుదేరారు. కారులో ఆయనతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. నార్కేట్ పల్లికి సమీపంలోని చిట్యాల్‌ను దాటిన తర్వాత గుంటూరు హైవేపైకి వచ్చాక హరికృష్ణ కారు స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. 
 
నల్గొండ జిల్లాలోని 12వ బెటాలియన్ పోలీస్ మైదానం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికే చిరు జల్లులు పడటం వల్ల రోడ్డు చిత్తడిగా మారింది. దీంతో కారు పూర్తిగా అదుపుతప్పి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న మరో కారును ఢీకొట్టి పల్టీలు కొట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన 12వ బెటాలియన్ పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నార్కేట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, తీవ్రంగా గాయపడిన హరికృష్ణను తరిలించే సమయంలో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదు. ఫలితంగా ఆయన ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. అంతేకాకుండా, హరికృష్ణ కారు ప్రయాణించిన మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నట్టు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ ఛాతిని స్టీరింగ్ బలంగా ఢీకొనడం, ఆ తర్వాత కారులో నుంచి కిందికి విసిరేయబడటంతో తలకు బలమైన గాయం తగిలి రక్తం ధారగా పోవడం హరికృష్ణ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments