Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడిపోయిన ఐశ్వర్య - ధనుష్ దంపతులు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (08:21 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, సినీ హీరో, ఆమె భర్త ధనుష్  దంపతులు విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో తమతమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు. తమ విడాకుల విషయాన్ని తొలుత హీరో ధనుష్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఐశ్వర్య తన ఇన్‌స్టా ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దీంతో వారి 18 యేళ్ల వైవాహిక బంధానికి తెరపడింది. 
 
"18 యేళ్లుగా స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం ఇలా సాగింది ప్రయాణం. ఈ రోజున ఇరువురివి భిన్న మార్గాలుగా కనిపిస్తున్నాయి. ధనుష్ నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్ కోసం మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను ్ధికమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో..." అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, వీరిద్దరి వివాహం గత 2004లో జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా యాత్రా, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతేకాకుండా, వీరిద్దరూ కలిసి పోయస్ గార్డెన్‌లో సొంతంగా కూడా ఓ ఇంటి నిర్మాణానికి కూడా గతంలో శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. కాగా, గత యేడాది టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరొందిన అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments