Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్‌డన్ ఫాదర్, శభాష్ డాటర్: సిఐ, డిఎస్పీకి డిజిపి సెల్యూట్

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (19:45 IST)
తిరుపతిలోని పోలీస్ డ్యూటీ మీట్‌లో సెంటర్ ఫర్ అట్రాక్షన్‌గా నిలిచిన తండ్రీకూతురును అభినందించారు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్. వెల్ డన్ ఫాదర్.. శభాష్ డాటర్ అంటూ ప్రశంసించారు. సిఐగా ఉన్న శ్యామ్ సుందర్, డిఎస్పీగా ఉన్న జెస్సి ప్రశాంతిలకు డిజిపి సెల్యూట్ చేశారు. 
 
అసలెందుకు డిజిపి సెల్యూట్ చేశారంటే.. తండ్రి సిఐ.. కూతురు డిఎస్పీ. తన కన్నా పెద్ద స్థాయిలో ఉండటంతో తండ్రి తిరుపతిలో జరుగుతున్న పోలీస్ మీట్‌లో కుమార్తెకు సెల్యూట్ చేశాడు. ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. దీంతో సినీ ప్రముఖులు కూడా ఈ ఫోటోను టాగ్ చేసి మీరు పలువురికి స్ఫూర్తి అంటూ అభినందించారు. 
 
దీంతో డిజిపి స్వయంగా ఈరోజు మధ్యాహ్నం తండ్రీకూతురును పిలిచి మాట్లాడారు. వారికి సెల్యూట్ చేశారు. దీంతో డిజిపి దృష్టికి కొన్ని విషయాలను తీసుకెళ్ళింది డిఎస్పీ ప్రశాంతి. తను పోలీసు కావాలన్న ఆశను తన తండ్రి నెరవేర్చారని చెప్పారు. ఈ సందర్భంగా డిజిపి స్వయంగా ఇద్దరినీ సన్మానించారు. వేదికపై శ్యాంసుందర్ మాట్లాడుతూ తన కుమార్తె ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందని.. పోలీస్ డ్యూటీ మీట్‌లో సన్మానం చేయడం మరింత సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments