Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూకు విశేష స్పందన .. రికార్డులకెక్కిన రాజస్థాన్

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (09:37 IST)
కరోనా వైరస్ విముక్త భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ జనతా కర్ఫ్యూకు ఎవరూ ఊహించని విశేష స్పందన కనిపిస్తోంది. 
 
దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. ఒక్క అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
 
అయితే, అత్యవసర సేవలైన వైద్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ,  ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి మాత్రం జనతా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అయితే పెట్రోలు బంకులు కూడా మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. జనతా కర్ఫ్యూను దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటిస్తూ ఇళ్లలోనే ఉండడంతో దేశం మొత్తం పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా మారిపోయింది.
 
రాజస్థాన్ రికార్డు 
రాజస్థాన్ రికార్డులకెక్కింది. కరోనా వైరస్ కారణంగా పూర్తి నిర్బంధంలోకి వెళ్లిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఈ నెల 31 వరకు రాష్ట్రాన్ని షట్‌డౌన్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. 
 
సీఎం ఆదేశాలతో శనివారం అర్థరాత్రి నుంచే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర సేవలు తప్ప మాల్స్, షాపులు, ఇతర దుకాణాలు అన్నీ మూతపడ్డాయి.
 
షట్‌డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా ఆహార పొట్లాలు పంపిణీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అర్హులందరికీ ఉచితంగా గోధుమలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 
 
రాజస్థాన్‌లో శనివారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల మొత్తం సంఖ్య 23కు పెరిగింది. కరోనా బాధితుల్లో నాలుగున్నరేళ్ల బాలిక ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ శంబాల లో ఆది లుక్

రియ‌ల్ కోర్ట్ డ్రామా థ్రిల్ల‌ర్ గా లీగ‌ల్లీ వీర్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments