రాహుల్ గాంధీ ''గోత్రం''పై బీజేపీ ఓవరాక్షన్.. నెహ్రూకి ఇందిరమ్మ తలకొరివి పెట్టడంతో?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:00 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోత్రంపై ప్రస్తుతం వివాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుష్కర్ ఆలయానికి వెళ్లిన రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో గోత్ర నామాలు చెప్పాల్సి వుండగా, తాను కౌల్ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అని, తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. 
 
రాహుల్ గాంధీ తల్లి, మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీకి చెందిన వారు కావడంతో బీజేపీ కొత్తగా ''ఇట్లస్'' అనే గోత్రాన్ని సృష్టించింది. ఫిరోజ్ గాంధీని ఇందిరాగాంధీ వివాహం చేసుకున్న తరుణంలో నెహ్రూ గోత్రం రాహుల్‌కు ఎలా వచ్చిందని బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ గోత్రంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాడీవేడీ చర్చ సాగుతోంది. 
 
ఈ క్రమంలో ఈ వివాదానికి పుష్కర్ ఆలయ పూజారి ఫుల్ స్టాప్ పెట్టాలని చూశారు. నెహ్రూకి మగ సంతానం లేకపోవడంతో ఆయనకి ఆమె తలకొరివి పెట్టి.. అంత్యక్రియలు చేశారని.. అందుకే నెహ్రూ గోత్రం ఇందిరకు.. ఆ తర్వాత రాజీవ్‌కు, ఆయన అనంతరం రాహుల్ గాంధీకి వచ్చిందని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఎలా కామెంట్లు చేస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments