ఆర్టీసీ కార్మికులు తిన్నది అరగక సమ్మె చేస్తున్నారు .. ఆర్టీసీ కథ ముగుస్తుంది : కేసీఆర్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (16:59 IST)
ఆర్టీసీ కార్మికులు తిన్నది అరగక సమ్మె చేస్తున్నారనీ, వారు తక్షణం సమ్మె విరమించకపోతే.. ఆర్టీసీ కథ త్వరలోనే ముగుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయం అనంతరం సీఎం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
 
అలాగే, గత కొన్ని రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆయన మాట్లాడారు. ఆర్టీసీ గురించి తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్లపాటు రవాణాశాఖ మంత్రిగా పని చేశానని, ఆ సమయంలో 13 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఆర్టీసీని యేడాది తిరిగేలోపు 14 కోట్ల రూపాయల మేరకు లాభాల బాటలోకి మళ్లించినట్టు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించలేనన్నారు. పైగా, ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఆర్థికాభివృద్ధి రెండు శాతానికి పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విషయాలను ప్రజలకు ఎప్పటికపుడు తెలుపుతూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు తెలిపారు. 
 
మరో రెండు మూడు నెలల్లో యూనియన్ ఎన్నికలు జరుగనున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు అర్థరహితంగా, తిన్నది అరగక సమ్మె చేస్తున్నారన్నారు. ఈ సమ్మెను తక్షణం ముగించకుంటే ఆర్టీసీ కథే ముగుస్తుందని హెచ్చరించారు. పైగా, కార్మికుల సమస్య పరిష్కారం కోసం కమిటీ వేస్తే ఎంత కాలం తీసుకుంటారంటూ లంగా ప్రచారం చేశారనీ, వీరితో కొన్ని రాజకీయ పార్టీలు కలిసి యాగీ చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని

సూర్య, RJ బాలాజీ కాంబినేషన్ చిత్రం కరుప్పు విడుదల తేదీ ప్రకటన

IIFTC అవార్డుల్లో గేమ్ ఛేంజర్, విశ్వం చిత్రాలకు పురస్కారాలు

Shiva Raj Kumar: గుమ్మడి నర్సయ్య నుంచి శివ రాజ్ కుమార్ ఫియర్స్ లుక్

Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

డ్రీమ్‌ టెక్నాలజీ నుంచి L40 అల్ట్రా AE, D20 అల్ట్రా ఆల్‌-ఇన్‌-వన్‌ రోబోటిక్ వాక్యూమ్స్‌

మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది

ఫ్యాబ్ ఇండియా ఉగాది కలెక్షన్‌తో కొత్త ఆరంభాల వేడుక

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments