Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్‌కు కంటిమీద కనుకు లేకుండా చేసిన జీ జిన్‌పింగ్

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:39 IST)
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. భారత్ చైనా ద్వైపాక్షిక చర్చల కోసం వచ్చే ఆయన చెన్నైకు చేరుకుంటారు. ఆ తర్వాత చెన్నై సముద్ర తీర పర్యాటక ప్రాంతమైన మహాబలిపురంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతారు. 
 
అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు బయలుదేరేముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు తేరుకోలేని షాకిచ్చారు. కాశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనంటూ తేల్చి చెప్పారు.  
 
నిజానికి చైనా అధ్యక్షుడి పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, 36 గంటల క్రితం వరకూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలోనే ఉన్నారు. బీజింగ్‌లో జిన్‍పింగ్‌తో చర్చలు జరిపారు కూడా. ఆ సమయంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు రాగా, ఈ వ్యవహారాన్ని ఇండియా, పాకిస్థాన్‌లు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిందే మినహా, మరో దేశం కల్పించుకునే పరిస్థితి లేదని జిన్‌పింగ్ కుండ బద్దలు కొట్టారు. 
 
ఇటీవలి ఐరాస సమావేశాల్లో పాకిస్థాన్‌కు కొంత అనుకూలంగా మాట్లాడిన చైనా, ఆపై వారం రోజులు గడిచేసరికి, స్వరాన్ని మార్చుకోవడం భారత్ సాధించిన దౌత్య విజయమే. అంతేకాకుండా, చైనా అధ్యక్షుడి భారత్ పర్యటన పాకిస్థాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments