చంద్రయాన్-2 : సజావుగా పని చేస్తున్న ఆర్బిటర్ పేలోడర్లు.. ఇస్రో

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (09:22 IST)
చంద్రుడి దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం చంద్రయాన్ - 2 పేరుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైన విషయం తెల్సిందే. జాబిల్లిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్... హార్డ్ ల్యాండింగ్ కారణంగా భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కూడా తెలియలేదు. 
 
ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం అమెరికా పరిశోధనా సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది. ఇందుకోసం ఈ నెల 17వ తేదీన లూనార్ ఆర్బిటర్‌ను నాసా పంపించింది. ఈ లూనార్ ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో విక్రమ్ కనిపించిందా లేదా అన్న దానిపై ఇస్రో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నాు. 
 
మరోవైపు, చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్ సక్రమంగానే పనిచేస్తోందని, ఆర్బిటర్‌లోని పేలోడర్లు కూడా బాగానే పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. అయినప్పటికీ విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు కలవకపోవడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 7న చంద్రుడిపై ల్యాండ్ అవుతూ ఇస్రోతో విక్రమ్ ల్యాండర్ సంబంధాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments