ఐపీఎల్ అవసరమా? చెన్నై టీమ్ నల్ల బ్యాడ్జ్ ధరించి ఆడండి: రజనీ

కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్‌ను అన్నాడీఎంకే ఎంపీలు స్తంభింపజేశారు. ఈ క్రమంలో వైకాపా, టీడీపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చే జరగకుండా పోయిన సంగతి తెలిసిందే. తమ

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (15:51 IST)
కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్‌ను అన్నాడీఎంకే ఎంపీలు స్తంభింపజేశారు. ఈ క్రమంలో వైకాపా, టీడీపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చే జరగకుండా పోయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతూ, కావేరీ నదీ జలాల కోసం నిరసనలు తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తమిళ సినీ తారలు కావేరి జలాల కోసం సినీ తారలు మౌనదీక్ష చేపట్టారు. చెన్నైలోని వల్లువర్ కోట్టమ్‌లో కావేరీ జలాల కోసం జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కోలీవుడ్ హీరోలు విజయ్, సూర్య, సత్యరాజ్, శివకుమార్, ధనుష్,నాజర్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరం వద్దకు వచ్చి సినీతారలకు అగ్రహీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ మద్దతు పలికారు. 
 
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాగునీటి సమస్యలుండగా, ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎందుకంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ, క్రికెట్ పోటీలు జరుగుతూ ఉండటం తనకు ఇబ్బందిని, చిరాకును తెప్పిస్తోందన్నారు. 
 
ఈ పోటీల్లో క్రీడాకారులు ప్రజల నిరసనలకు మద్దతుగా కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ క్రీడాకారులు తమిళనాడుకు మద్దతుగా నల్ల బ్యాడ్జ్‌లను ధరించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments