Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి ఉచ్చులో చిక్కుకున్న"బుల్లెట్ బండి" వరుడు

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (08:56 IST)
కొద్ది రోజుల క్రితం బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. బుల్లెట్ బండి పాటకు నవ దంపతులు డ్యాన్స్ చేసి ప్రతి ఒక్కరినీ ఆనందంలో ముంచెత్తారు. ఆ పాటలో ఉన్న వరుడు ఇపుడు మరోమారు వార్తలకెక్కాడు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉచ్చులో చిక్కుకున్నాడు. తాజాగా రూ.30 వేలు లంచాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇపుడు ఈ వరుడు బాగోతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా ఆకుల అశోక్ పని చేస్తున్నాడు. ఈయన మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిపోయాడు. ఈ కేసులో అశోక్‌తో పాటు ఆర్కిటెక్ట్ శ్రీనివాసరాజును కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 
 
సరూర్ నగరులోని జేబీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తొలుత అశోక్‌ను ఆ తర్వాత శ్రీనివాసరాజును అదుపులోకి తీసుకున్నారు. ఒక ఫ్లాటు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు ఏ.దేవేందర్ రెడ్డి అనే ఇంటి యజమాని నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో దేవేందర్ రెడ్డి ఏసీబిని ఆశ్రయించగా, వారు పక్కాగా ఉచ్చువేసి అశోక్, శ్రీనివాసరాజులను పట్టుకున్నారు. 
 
అశోక్ అఫీస్ టేబుల్‌లో రూ.30 వేల లంచం సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ లంచావుతారులిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. నిజానికి టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న అశోక్ రెండేళ్ల క్రితం ఎవరో కూడా తెలియదు. ఒక సాధారణ ఉద్యోగి. కానీ, ఆయన వివాహం ముగిసిన తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో అశోక్ సతీమణి "నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా" అనే పాటతో భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ ఒక్క పాట రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను షేక్ చేసింది. అయితే, అశోక్ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో.. ఇపుడు లంచం తీసుకుని అంతే చెడ్డ పేరు ఆపాదించుకుని పరువు పోగొట్టుకున్నాడు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments