Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మం మాట పొల్లు పోదురా, కోడిపుంజు పిల్ల‌ల్ని పెట్టిందిరా! (video)

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (17:29 IST)
అల‌నాడు వీర బ్ర‌హ్మంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ఒక్కొక్క‌టి నిజం అవుతూ వ‌స్తోంది. కోడి పెట్ట గుడ్డు పెట్ట‌డం... పిల్ల‌న్ని పొద‌గ‌డం కామ‌న్. ఇక్క‌డ కోడిపుంజు గుడ్లు పెట్టింది... త‌న పిల్ల‌న్ని పొదిగి పెద్ద చేస్తోంది. అకటా... ఇది ఎక్క‌డో కాదు... సాక్షాత్తు వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి సంచ‌రించిన శ్రీకాళహస్తిలోనే.
 
గ‌డ్లుపెట్టి... పిల్లల్ని చేసిన వింత కోడి పుంజు ఇది. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని  తొట్టంబేడు మండలం లోని పెద్ద కన్నలి గ్రామంలో ఈ వింత జ‌రిగింది. స్థానిక‌ ఎస్‌టి కాలనీలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఈ వింత‌ను చూసి అంద‌రూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.

ఈయ‌న‌ కోడి పుంజులు వేకువజామునే కూత వేసి నిద్రలేపేవి. తరుచు కొట్లాడుకునేవి... ఇవి మామూలే అనుకునేవాడు సుబ్రహ్మణ్యం. తీరా చూస్తే, త‌న ఇంట్లో నాటు కోడి పుంజు గుడ్లు పెట్టి పిల్లలు చేసి... వాటిని కంటికిరెప్పలా కాపాడుతోంది. 
 
గ్రామంలో వింత చోటుచేసుకోవడంతో ఈ వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి వింత కలికాలం అంటున్నారు. దీనిపై వైద్య అధికారిని వివరణ అడగగా, జన్యు లోపం వల్ల అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తెలిపారు. జన్యులోపం సంగతి పక్కన పెడితే.. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇలా జరుగుతుందని వుంది మరి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments