Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజం పాలిట బీజేపీ ప్రమాదకరంగా మారుతోంది : ప్రకాష్ రాజ్

భారతీయ జనతా పార్టీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కత్తికట్టినట్టున్నారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ఆయన కన్నడ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Webdunia
గురువారం, 10 మే 2018 (09:06 IST)
భారతీయ జనతా పార్టీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కత్తికట్టినట్టున్నారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ఆయన కన్నడ ఓటర్లకు పిలుపునిచ్చారు. అదేసమయంలో తాను ఫలానా పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరడం లేదనీ, కేవలం బీజేపీని ఓడించాలని మాత్రమే కోరుతున్నట్టు చెప్పారు.
 
అలా ఎందుకు పిలుపునిస్తున్నానో కూడా ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ సమాజం పాలిట ప్రమాదకరంగా తయారవుతోంది. ఒక కులం, ఒక మతం మాత్రమే దేశాన్ని ఏలాలనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. అధికారంలోకి రావడానికి కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది. నేను హిందూయిజానికి వ్యతిరేకిని కాదు. కానీ, బీజేపీ చేష్టలతో హిందూయిజానికి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాను అని వివరించారు. 
 
ఇదే పంథాను కొనసాగిస్తా.. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా. మోడీ నుంచి దేశాన్ని కాపాడేందుకు నాలాంటి చౌకీదార్లు ఎందరో తయారవుతున్నారు. వారిని ఏకతాటిపైకి తీసుకొస్తా. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో నా బాటలో 3 వేల మంది తయారయ్యారు. మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తున్నా. మాస్‌ గల్లీలో ప్రచారం చేస్తే.. క్లాస్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments