Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామ్రాట్ మంచి మనిషి.. బిగ్ బాస్ హౌస్‌లోకి మళ్లీ తేజస్వి రీ ఎంట్రీ ఇస్తుందా?

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తేజస్వి తన లవ్వాయణంపై నోరువిప్పింది. బిగ్ బాస్ హౌస్‌లో తేజస్వి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తేజస్వి అలకలు, విస

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (16:41 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తేజస్వి తన లవ్వాయణంపై నోరువిప్పింది. బిగ్ బాస్ హౌస్‌లో తేజస్వి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తేజస్వి అలకలు, విసుర్లు, కోపాలు ఈ షోకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. 
 
ఇక ఈ షోలో సామ్రాట్ పట్ల ఆమె చనువుగా వుండటాన్ని చూసినవారంతా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ మాట్లాడుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారేమోనని అందరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ''బిగ్ బాస్ హౌస్'' లో నుంచి తేజస్వి ఎలిమినేట్ అయింది.
 
తాజాగా ఆమె ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడుతూ "అందరూ కూడా సామ్రాట్‌కు.. నీకు మధ్య ఏముంది? అని అడుగుతున్నారు. మా మధ్య ఏమీ లేదు .. ఆయన ఒక మంచి మనిషి అంటూ సమాధానమిచ్చింది. అలాగే తనీశ్ కూడా. మంచి మనుషులంతా కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు. వాళ్లని ఒక టీమ్ అనొచ్చు. ఈ షోలో సామ్రాట్ కనిపించట్లేదు. తననే ఎక్కువగా చూపించారు. అరవడం, తిట్టడం తన గురించి ఇతరులు మాట్లాడుకోవడాన్ని అధికంగా చూరించారు. అయితే 'బిగ్ బాస్ హౌస్'లోకి వెళ్లాలనుకుంటున్నాను.. అది మీ చేతుల్లోనే వుందంటూ తేజస్వి తెలిపింది. 
 
ఎందుకంటే..? ఇప్పటి వరకు బిగ్ బాల్ హౌస్-2లో ఎలిమినేట్ అయిన వారిని ప్రేక్షకులు ఓట్ల ద్వారా తిరిగి హౌస్‌లోకి పంపవచ్చునని.. నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో తేజస్వి తిరిగి బిగ్ బాస్-2లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments