Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబులతో కాదురా... బాలయ్య కంటిచూపుతో చంపేస్తాడు... పాక్ ప్రధానికి బాలయ్య ఫ్యాన్ పోస్ట్

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (19:02 IST)
ఫిబ్రవరి 14న పాక్ భూభాగంపై ఆశ్రయిస్తున్న ఉగ్రవాదులు భారత జవాన్లను దొంగ దెబ్బ తీయడం, ఈ దాడిలో 43 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ దాడిపై భారతదేశం యావత్తూ పాకిస్తాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. 
 
ఇదిలావుంటే సినీ నటుల ఫ్యాన్స్ కూడా తమ ఆవేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. బాలయ్య అభిమానుల్లో ఒకరు పాక్ ప్రధాని ఇమ్రాన్‌కి వార్నింగ్ ఇస్తూ... 'మీ దేశాన్ని ముగించడానికి మా బాలయ్య బాబు చాలు.. బాంబులతో కాదురా కంటి చూపుతో చంపేస్తాడు' అంటూ పోస్టు చేశాడు. మరో నెటిజన్ అయితే... 'ఫేస్‌ టూ ఫేస్ రా.. మా సోల్జర్స్ మార్చింగ్‌కే నీకు హార్ట్ అటాక్ వస్తది' అంటూ పోస్ట్ చేశాడు. 
 
ఇలా పాకిస్తాన్ దేశం పైన, ఉగ్రవాదుల దుశ్చర్యల పైన భారతదేశం నుంచి తీవ్ర నిరశనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ తన చేతకాని తనాన్ని ఎప్పటిలాగే కనబరుస్తూ కాలు కాలిన పిల్లిలా ప్రవర్తిస్తోంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన కూడా చేయలేని చేతకానితనంతో అక్కడి ప్రభుత్వం వున్నదంటూ మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

సూర్య నటించిన రెట్రో ప్రీరిలీజ్ హైదరాబాద్ లో గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments