Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమం.. ఎయిమ్స్ హెల్త్ బులిటెన్

బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. జూన్ 11 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కురువృద్ధుడి ఆరోగ్యం క్షీణించి

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (11:26 IST)
బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. జూన్ 11 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కురువృద్ధుడి ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు ప్రకటన విడుదల చేయడంతో కాషాయదళంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అటల్ ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే ప్రముఖులు ఎయిమ్స్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. 
 
ప్రధాని మోదీ బుధవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి సుమారు గంటపాటు అక్కడే గడిపారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా గురువారం ఉదయం ఎయిమ్స్‌కి వెళ్లారు. తాజాగా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. 
 
కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాజ్ పేయి చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల చేరారు. ఆయన ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్‌కు చేరుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments