గుజరాత్‌లో ఆప్ దూకుడు.. ఆటో డ్రైవర్ ఇంట్లో డిన్నర్‌కు కేజ్రీవాల్ సై

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (09:37 IST)
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇపుడు గుజరాత్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతమైన గుజరాత్‌లో బీజేపీ గత 20 యేళ్లుగా అధికారంలో ఉంది. దీంతో అక్కడ అధికార మార్పిడికి నాంది పలకాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బలంగా భావిస్తున్నారు. అందుకే గుజరాత్‌పై ఫోకస్ పెట్టారు. ఈ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో గుజరాత్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు. 
 
ఇందులోభాగంగా, ప్రస్తుతం ఆయన గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తమ ఇంటికి భోజనానికి వస్తారా? అని ఓ ఆటో డ్రైవర్ అడిగిన ప్రశ్నకు అరవింద్ కేజ్రీవాల్ సమ్మతం తెలిపారు. పైగా, మీ సొంత ఆటోలోనే మీ ఇంటికి భోజనానికి వెళ్దాం అంటూ చెప్పారు. పైగా, తనతో పాటు మరో ఇద్దరు కూడా మీ ఇంటికి భోజనానికి వస్తాం అంటూ సమాధానం ఇచ్చి, ఆ ఆటో డ్రైవర్‌కు ఎనలేని సంతోషాన్ని మిగిల్చాడు. 
 
ఈ యేడాది ఆఖరులో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అక్కడ పాగా వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముమ్మరంగా పర్యటనలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, అన్ని రంగాల వారితో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, అహ్మదాబాద్‌ నగరంలో ఆయన ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఎన్నికల్లో తాను గెలవడం వెనుక ఆటో డ్రైవర్ల సహకారం ఎంతగానో ఉందని చెప్పారు. అలాగే, గుజరాత్ రాష్ట్రంలోనూ ఆటో డ్రైవర్లు ఆ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఇదిలావుంటే,  ఈ సమావేశంలో పాల్గొన్న విక్రమ్ దత్తా అనే ఆటో డ్రైవర్ మాట్లాడుతూ, తాను కేజ్రీవాల్‌కు వీరాభిమానిని అని చెప్పారు. పంజాబ్‌‌లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో చూశానని.. అలా తమ ఇంటికి భోజనానికి వస్తారా? అని అడిగాడు.
 
ఈ ఆటో డ్రైవర్ విజ్ఞప్తికి కేజ్రీవాల్ అక్కడే స్పందించారు. 'తప్పకుండా వస్తా. నాతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా మీ ఇంటికి భోజనానికి వస్తారు. రాత్రి 8 గంటలకు నీ ఆటోలోనే మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి తీసుకెళ్తావా?' అని అడిగారు. కేజ్రీవాల్ అలా జవాబివ్వడంతో ఉబ్బితబ్బిబ్బయిన విక్రమ్ దత్తా.. తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

Rashmika: రియల్ పెండ్లి కంటే ముందే రణబాలి లోని రీల్ పెండ్లి సాంగ్ రష్మికకు అంకితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments