Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాలు, మతాలను విడదీసే సంస్కృతి బీజేపీది : యనమల ఫైర్

కులాలు, మతాలను విడదీసే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు.

Webdunia
బుధవారం, 9 మే 2018 (14:27 IST)
కులాలు, మతాలను విడదీసే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ ఒక మాట మాట్లాడారనీ, ఇపుడు ప్రధాని అయ్యాక మరో మాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
 
ముఖ్యంగా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను మోడీ తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా 50 శాతం ఉండాలని మోడీ డిమాండ్‌ చేశారని యనమల గుర్తుచేశారు. కానీ, ఇపుడు ప్రధాని అయ్యాక పన్నుల వాటాను 47 శాతానికి కుదించారని, ఇప్పుడు ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట... పీఎం అయ్యాక ఇంకోమాట మాట్లాడితే ఎలా? అని యనమల ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, కులాలు, మతాలను విడదీసే సంస్కృతి బీజేపీకి ఉందని... టీడీపీది కుల, మతాలను కలిపే సంస్కృతి అని చెప్పుకొచ్చారు. టీడీపీని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రాల మౌలిక, ఆర్థిక స్వరూపాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని... ఇది రాజ్యాంగానికే సవాల్‌ అని యనమల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments