Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ చెప్పినా.. చంద్రబాబు కనికరించలేదు... అనిత తొలగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నుంచి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంగలపూడి అనితను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బోర్డు సభ్యుల జాబితా నుంచి తన పేరును ఉపసంహరించాలని ఆమె

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (10:26 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నుంచి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంగలపూడి అనితను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బోర్డు సభ్యుల జాబితా నుంచి తన పేరును ఉపసంహరించాలని ఆమె చేసిన వినతిని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
 
నిజానికి ఈనెల 20న టీటీడీ బోర్డు నియామకం జరిగింది. ఇందులో అనితను ఓ సభ్యురాలిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే, ఆమె హిందువు కాదనే వివాదం తెరపైకి వచ్చింది. గతంలో ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ అని అని చెప్పింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఆమె నుంచి వివరణ కోరింది. ఈ వివరణలో తాను క్రిస్టియన్ కాదనీ హిందువునేనంటూ ఆమె స్పష్టం చేశారు కూడా. 
 
అయితే, హిందూ ధార్మిక సంస్థలు మాత్రం ఈ వివాదాన్ని మరింత రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో తనను పాలక మండలి నుంచి తొలగించాలంటూ ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పాలక మండలి నుంచి ఆమెను అధికారికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments