Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి చెబితే అర్థంకాదా... రామాయణం అంతా విని... హోదాపై రాజ్‌నాథ్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరా? అనే ప్రశ్నకు సూటిగా సుత్తిలేకుండా సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆ

Webdunia
బుధవారం, 25 జులై 2018 (09:38 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరా? అనే ప్రశ్నకు సూటిగా సుత్తిలేకుండా సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అంతే సూటిగా సమాధానమిచ్చారు. తల అడ్డంగా ఊపుతూ... ఒక్కసారి చెబితే అర్థం కాదా... ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఏమిటి? మీకు అర్థం కాలేదా అంటూ ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిపారేశారు. పైగా, 14వ ఆర్థిక సంఘం అడ్డు చెప్పిందంటూ మెలిక పెట్టారు.
 
విభజన సమస్యలపై మంగళవారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ, విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్నీ తు.చ. తప్పకుండా అమలు చేశాం. ఇప్పటికే 90 శాతం హామీలు నెరవేర్చాం. మిగిలినవి నెరవేరుస్తున్నాం. ప్రత్యేక హోదా ద్వారా లభించే నిధులకన్నా అధికంగానే ఇస్తున్నాం. ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రే. ఏ పార్టీ ప్రభుత్వానికి చెందిన వారైనా సరే... ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఏపీకి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం అని స్పష్టం చేశారు. 
 
ప్రత్యేక హోదా స్థానంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా వివిధ శాఖల ద్వారా మంజూరీలు, ప్రాజెక్టులు, పెట్టుబడుల ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రహదారులు, పెట్రోలియం, నౌకాయానం, రక్షణ శాఖ ద్వారా ఏపీకి నిధులు అందుతున్నాయని చెప్పారు. అలాగే, ఏపీలో రైల్వే జోన్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments