Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయకులారా తస్మాత్ జాగ్రత్త.. నాలుక తెగ్గోస్తాం... మీసం మెలేసిన పోలీస్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఘాటైన హెచ్చరిక చేసింది. పోలీసులను, పోలీసు వ్యవస్థను కించపరిస్తే నాలుక తెగ్గోస్తాం.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించింది.

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (09:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఘాటైన హెచ్చరిక చేసింది. పోలీసులను, పోలీసు వ్యవస్థను కించపరిస్తే నాలుక తెగ్గోస్తాం.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అనంతపురం జిల్లాలో ప్రభోదానంద ఆశ్రమ వివాదం విషయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సిగ్గులేని పోలీసులు, నిర్వీర్యమైన వ్యవస్థ, ఉన్నట్టా చచ్చిపోయినట్లా అని జేసీ ఇటీవల మండిపడ్డారు. అంతేకాదు... 'మీరు ఇంతే' అనేలా పోలీసుల ముందు హిజ్రాలతో నృత్యాలు చేయించారు.
 
ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం సీరియస్ అయింది. అనంతపురంలో గురువారం సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే త్రిలోకనాథ్‌, కార్యదర్శి గోరంట్ల మాధవ్‌, సంయుక్త కార్యదర్శి సూర్యకుమార్‌ మీడియాతో మాట్లాడారు. 'ఇటీవల పార్టీలకు అతీతంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు పోలీసు వ్యవస్థ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఒంటిచేత్తో అణచివేశాం. ఆ విషయం మరిచిపోవద్దు. ఇన్నాళ్లు సంయమనం పాటించాం. ఇకపై సహించేది లేదు. అదుపు తప్పి మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం' అంటూ గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు.
 
అంతేకాకుండా, పోలీసులను హిజ్రాలతో పోల్చుతూ నృత్యాలు చేయించడంపై ఆయన ఒకింత ఘాటుగా స్పందించారు. 'మేమూ రాయలసీమ బిడ్డలమే. మాకూ పౌరుషం ఉంది. మగాళ్లం కాబట్టే పోలీసు వ్యవస్థలోకి వచ్చాం. ఈ వ్యవస్థలో పని చేస్తున్నాం! అని మీసం మెలేసి చెప్పారు. నాయకులారా.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పైగా, తమను హిజ్రాలతో పోల్చిన వారికి ఇదే తమ సమాధానమని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments