Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. ఎంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానో: అల్లు అర్జున్

మెగా హీరో, అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట చూడముచ్చటగా వుంటుంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వుంటారు.

Webdunia
బుధవారం, 25 జులై 2018 (15:11 IST)
మెగా హీరో, అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట చూడముచ్చటగా వుంటుంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వుంటారు. 
 
తాజాగా, బన్నీ సరదాగా తన భార్యను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆఫ్‌ వైట్‌ సల్వార్‌ కమీజ్‌ దుస్తుల్లో అందంగా తయారైన స్నేహా ఫొటోను పోస్ట్‌ చేస్తూ..''ఓ మై గాడ్‌.. ఇంతటి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని నమ్మలేకపోతున్నాను'' అని చమత్కరించారు. 
 
ఫొటోలో స్నేహారెడ్డి చాలా అందంగా ముస్తాబయ్యారు. ప్రముఖ స్టైలిస్ట్‌ హర్మాన్‌ కౌర్‌ స్నేహాను ఇలా అందంగా ముస్తాబుచేశారట. తన భార్యను ఉద్దేశిస్తూ బన్నీ అలా క్యాప్షన్‌ ఇవ్వడంతో అభిమానులు సరదాగా కామెంట్స్‌ పెడుతున్నారు. బన్నీ ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే రెండు లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.
 
''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' చిత్రంతో ఇటీవల బన్నీ ప్రేక్షకుల ముందుకొచ్చిన బన్నీ.. విక్రమ్‌ కె కుమార్‌ ప్రాజెక్టును ఖరారు చేసినట్లు తాజా సమాచారం. నల్లమలుపు బుజ్జి, నాగ అశోక్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments