సికింద్రాబాద్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు - యూపీలోనూ 2 రైళ్లకు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (11:34 IST)
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. శుక్రవారం కూడా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు.  
 
ఇపుడు ఆ సెగ హైదరాబాద్‌కూ తాకింది. ఫలితంగా సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
 
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొంతమంది యువకులు ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసన తెలిపారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిప్పు పెట్టారు.
 
అలాగే, యూపీలోని బల్లియాలో శుక్రవారం ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్‌లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
 
మరోవైపు బీహార్‌లోని మొహియుద్దినగర్ స్టేషన్‌లోనూ జమ్మూతావి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన రెండు బోగీలకు నిరసనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలోనూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. లఖ్‌మినియా రైల్వే స్టేషన్‌ వద్ద ఆందోళనకారులు పట్టాలపై కూర్చొని నిరసన చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోనూ ఈ నిరసనలు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వదినపై రూ. 2 కోట్ల పరువు నష్టం వేసిన హీరోయిన్ హన్సిక

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ లాంఛ్

లవ్ స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బేబమ్మ రోల్.. ప్రదీప్ రంగనాథన్ స్వీట్ పర్సన్

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం సిద్ధం

Poorna: పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన డార్క్ నైట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

తర్వాతి కథనం
Show comments