చీఫ్ జస్టిస్ అభిశంసన : సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది.

Webdunia
మంగళవారం, 8 మే 2018 (12:04 IST)
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. తమ నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, పలువురు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మంగళవారం పిటినష్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం, దాన్ని తోసిపుచ్చింది.
 
నిబంధనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడిన అత్యున్నత ధర్మాసనం, పిటిషన్‌పై తదుపరి విచారణ ఉండబోదని తేల్చిచెప్పింది. ఈ విషయమై రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వినతినీ తోసిపుచ్చింది. విషయాన్ని పార్లమెంట్ వేదికగానే తేల్చుకోవాలని సూచించింది. మీకు మీరుగానే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని సూచన చేయగా, ఆపై తమ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ అభిశంసన తీర్మానం అశంలో కాంగ్రెస్ భంగపాటుకు గురైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments