Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలను కుక్కి... మహారాష్ట్రలో కరోనా మృత్యుక్రీడ

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:14 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ మృత్యుక్రీడ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఇప్పటికే రికార్డుకెక్కిన మహారాష్ట్ర మృతుల్లోనూ అదేపరిస్థితి కొనసాగుతోంది. దీనికి నిదర్శనమే పై ఫోటో. ఒక అంబులెన్స్‌లో మహా అయితే ఒకటి లేదు రెండు మృతదేహాలను తీసుకొస్తారు. కానీ, ఇక్కడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 కరోనా మృతదేహాలను ఒకే ఒక్క అంబులెన్సులో కుక్కి పంపించారు అధికారులు. అదేమని అడిగితే నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు తీసిన వారి బంధువుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగిచ్చారు. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో జరిగింది. దీనిపై అధికారులు స్పందించారు. అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఈ కరోనా మృతదేహాలను తీసుకెళ్లినట్టు చెప్పారు.
 
‘‘మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమసంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు మృతదేహాలను అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం’’ అని ఆసుపత్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర అన్నారు.
 
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిబా అదనపు కలెక్టర్‌ను ఆదేశించినట్టు బీద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర జగ్తప్ చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments