Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ సినిమా ప్రారంభం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (07:59 IST)
కొంత విరామం తరువాత రామ్ చరణ్ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా కథపై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ వహించారు. సినిమాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. శీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన మహూర్తపు దృశ్యానికి వినాయక్ కెమేరా స్విచాన్ చేయగా, చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇచ్చారు.
 
సినిమా స్క్రిప్ట్‌ను చిరంజీవి దర్శక -నిర్మాతలకు అందించారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ - ‘‘రామ్‌చరణ్‌తో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది.  కొంత గ్యాప్ తర్వాత  మళ్లీ నేను, గోపీమోహన్, కోన వెంకట్  కలిసి మంచి కథ తయారుచేశాం. మా కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలన్నిటి లానే ఈ సినిమా కూడా హిట్టవుతుంది’’ అని చెప్పారు. సినిమా మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటుందని కోన వెంకట్ పేర్కొన్నారు.
 
నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ- ‘‘రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: అనల్ అరసు, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై ప్రవీణ్ కుమార్.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments