Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు కానుక లేదా...? ఏం.. ఎందుకు?

Webdunia
సోమవారం, 18 మే 2015 (22:45 IST)
సాధారణంగా సినిమా హీరోల పుట్టిన రోజు వస్తోందంటే ఒకటే హడావుడి. నెల ముందు నుంచే రకరకాల ప్రచారం ఉంటుంది. అది నెల నుంచి రోజుల్లోకి వస్తోందంటే ఆ హడావుడి తారాస్థాయికి చేరుతుంది. ఈ యేడాది ప్రముఖ టాలివుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక్క గిఫ్టు కూడా ఉన్నట్లు లేదు. ఆయన పుట్టిన రోజు రెండు రోజుల్లో ఉన్నా.. అదో సాదాసీదా పుట్టిన రోజులా గడిచిపోతుందేమో.. ఎందుకలా...? 
 
సాధారణంగా హీరోల పుట్టిన రోజు గిఫ్టు అంటే ఆయన ఏ సినిమా తీస్తున్నారు. ఏ సినిమా విడుదల చేస్తున్నారనే విషయం టాలివుడ్‌లో టాక్ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీగా మారుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా ఉన్నట్లు లేదు. టెంపర్ అనే సినిమాతో ఇంతోఅంతో హడావుడి జరిగింది. కాస్తోకూస్తో పేరువచ్చింది. మరి ఆ వ్యవహారం ముగిసి మూడు నెలలయినా ఇంతవరకు తరువాతి సినిమా అతీగతీ లేదు.  
 
అయితే ఆయన అభిమానులు మాత్రం ఇదిగో యూరప్ అంటారు..అదిగో షూటింగ్ అంటారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మరో సినిమా ఏదయినా ఒప్పుకున్నాడా అంటే అదీ లేదు. కనీసం స్క్రిప్ట్ డిస్కషన్ల జాడయినా వుందా అంటే అదీ లేదు. ఏ నిర్మాత, ఏ దర్శకుడు ఎన్టీఆర్ దాపులకు వెళ్తున్న దాఖలాలు లేవు. ఎన్టీఆర్ నమ్ముకున్న వినాయక్. రాజమోళి, బోయపాటి అందరూ వేరే హీరోలతో బిజీ బిజీగా ఉన్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. అయినా ఏ సినిమా ఫస్ట్ లుక్ లేదు, టీజర్ లేదు. మరే హడావుడి లేదు. ఈ టాప్ హీరో ఏం చేసి అభిమానులను హుషారెక్కిస్తాడో.. !
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

Show comments