Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వభూపాల వాహ‌నంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:01 IST)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో దర్శనమిచ్చారు.
 
సర్వభూపాల వాహ‌నం - య‌శోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. 
 
వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
 
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీ గౌత‌మ్‌రెడ్డి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీమ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా.నిశ్చిత‌, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.
 
కాగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన బుధ‌‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

తర్వాతి కథనం
Show comments