Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు... కల్పవృక్షవాహనంపై రాజమన్నార్... దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయి(Video)

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్షవాహనంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చె

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (16:59 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్షవాహనంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చెట్టు. సృష్టిలోని వృక్షాలన్నిటిలోకి మేటిది కల్పవృక్షం. కల్పవృక్షంపై కొలువుతీరిన వేంకటేశ్వరుడిని తమిళులు రాజమన్నార్ అవతారంగా కొనియాడతారు. భక్తులు కొరిన కొర్కెలను కల్పవృక్షం, కామధేనువు, చింతామణి తీరుస్తాయనది పురాణ ప్రాశస్త్యం. 
 
తనను శరణు కోరిన భక్తుల కోర్కెలను తీరుస్తానని చెప్పడానికే శ్రీవారి ఉభయ దేవేరిలతో కలసి కల్పవృక్షంపై దర్శనమిచ్చారు. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పికలు లేకపోవడం పూర్వ జన్మస్మరణ కలగడంతో పాటు కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయి కల్పవృక్షం సకల ఫలప్రదాయం, కావున తనను వేడుకున్నవారికి తానే అన్ని సమకూర్చుతాడని ఈ వాహనసేవ ద్వారా స్వామి వారు భక్తులకు తెలియజేస్తున్నారు. 
 
కల్పవృక్ష వాహనంలో పశువుల కాపరైన గోపాలకృష్ణుడి రూపంలో స్వామి వారిని అలంకరించారు. నిస్సంకల్ప స్థితికి నిష్కామ స్థితికి, నిశ్చింతా స్థితికి కల్పవృక్ష వాహన దర్శనం ద్వారానే ఆ ఫలాన్ని పరిపూర్ణంగా పొందగలరు. ఈ వాహనంలో ఊరేగే స్వామి వారిని చూడ్డానికి అశేష భక్తజనం మాడవీదుల్లో బారులు తీరారు. స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు ఇచ్చి తమ మ్రొక్కులు తీర్చుకున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments