Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రాండ్ గా వృష‌భ ట్రైల‌ర్ &లిరికల్ సాంగ్ లాంచ్

డీవీ
బుధవారం, 8 మే 2024 (17:01 IST)
Jeevan Reddy, Alekhya, Uma Shankar Reddy, ajay ghosh and others
జీవ‌న్ రెడ్డి, అలేఖ్య జంట‌గా ఉమా శంక‌ర్ రెడ్డి  నిర్మాత‌గా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్ గా, అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం వృష‌భ‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మం ఈ రోజు దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డిగారి జయంతి సందర్భంగా  ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.
 
ఈ కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ...`ట్రైల‌ర్ తో పాటు ఒక పాట విన్నాం చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్ గా ఉన్నారు. ద‌ర్శ‌కుడుకి ఈ చిత్రం మంచి పేరు తేవాల‌ని కోరుకుంటూ నిర్మాత‌కు శుభాకాంక్ష‌లు ` అన్నారు.
 
 ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ...`ట్రైల‌ర్ చూడ‌గానే ఇది డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ అనిపించింది. విన్న పాట కూడా చాలా బావుంది. సంగీతం, సాహిత్యం, సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి.  జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి కూతురు నిర్మాత‌గా చేయ‌డం సంతోషం. ఈ చిత్రం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు` అన్నారు.
 
 సీనియ‌ర్ నిర్మాత దామోదర్ ప్ర‌సాద్  మాట్లాడుతూ...`` ట్రైల‌ర్, విన్న పాట , టైటిల్ చాలా బావున్నాయి. క‌ళ ప‌ట్ల అభిమానంతో ఈ టీమ్ సినిమా చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.  ల‌యన్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...`జ‌య ప్ర‌కాష్ రెడ్డి గారి కూతురు ఈ సినిమాతో కో ప్రొడ్యూస‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. ట్రైల‌ర్, మ్యూజిక్ బాగుంది. గోమాత మీద సినిమా తీయ‌డం ఇదే ప్ర‌థమం. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా` అన్నారు.
 
 న‌టుడు అజ‌య్ ఘోష్  మాట్లాడుతూ...`జేపీ గారి కుమార్తె మ‌ల్లికా రెడ్డి గారి కోసం ఈ ప్రోగ్రామ్ కి వ‌చ్చాను. మ‌ట్టి వాస‌న‌తో కూడిన క‌థ ఇది. ట్రైల‌ర్... నేచ‌ర‌ల్ గా చాలా  బావుంది. ఇలాంటి క‌థ‌లతో సినిమాలు మ‌రెన్నో చేయాల‌ని కోరుకుంటూ  ఈ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు` అన్నారు.
 
న‌టుడు శివారెడ్డి మాట్లాడుతూ..`ట్రైల‌ర్ చాలా అద్భుతంగా ఉంది. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్ గా క‌నిపించారు. మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు టాలెంట్ ఏంటో ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌యింది` అన్నారు. విశ్వ కార్తికేయ మాట్లాడుతూ..`వృష‌భ‌ ట్రైల‌ర్ చాలా కొత్త‌గా అనిపించింది. చాలా నేచ‌ర‌ల్ గా సినిమా చేశారు. యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.
 
శ‌బ‌రి నిర్మాత‌ మ‌హేంద్ర మాట్లాడుతూ..`నిర్మాత‌లు ఒక ప్యాష‌న్ తో ఈ సినిమా చేశారు. ట్రైల‌ర్ , సాంగ్ చాలా బావుంది` అన్నారు.
 చిత్ర నిర్మాత  ఉమా శంకర్ రెడ్డి మాట్లాడుతూ..`నాలుగేళ్ల పాటు ఈ స్టోరి రాసుకున్నాం. ఎన్నో రాత్రులు ఈ సినిమా కోసం శ్ర‌మించాం. 85 శాతం సినిమా పూర్త‌యంది. ద‌ర్శ‌కుడు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చేశారు. టీమ్ అంతా ఎంతో స‌పోర్ట్ చేశారు. సినిమా కోసం ఎందాకైనా వెళ్తే వ్య‌క్తి మా హీరో. అలాగే మా హీరోయిన్ కూడా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఎమ్ ఎల్ రాజా అద్భ‌త‌మైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డిస్తాం` అన్నారు.
 
 మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఎమ్ ఎల్ రాజా మాట్లాడుతూ...`నాకు ఈ చిత్రాన్ని ఇచ్చి మంచి పాట‌లు చేయ‌డానికి  స‌పోర్ట్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు` అన్నారు. కో-ప్రొడ్యూస‌ర్ మ‌ల్లిక రెడ్డి  మాట్లాడుతూ...``మా నాన్న‌గారి బ‌ర్త్ డే రోజు మా సినిమాకు సంబంధించిన పాట‌, ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం సంతోషం. ఈ సినిమాలో నన్ను భాగ‌స్వామిగా చేసిన ఉమా శంక‌ర్ రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు . ఒక మంచి సినిమాలో పార్ట్ కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.
 
 ద‌ర్శ‌కుడు అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల  మాట్లాడుతూ...`` మా ప్రొడ్యూస‌ర్ ఉమా శంక‌ర్ గారు ఒక మంచి క‌థ రాసుకొని న‌న్ను అప్రోచ్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా హార్డ్ వ‌ర్క్ చేసాం. టీమ్ అంతా ఎంతో బాగా స‌హ‌క‌రించారు. హీరో జీవ‌న్ రెడ్డి గారు సినిమా కోసం ప్రాణం పెట్టారు. హీరోయిన్ కూడా ఎంతో శ్ర‌మించారు. సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ బాగా కుదిరింది. ఎమ్ ఎల్ రాజా నాకు మంచి మిత్రుడు. అద్భుత‌మైన పాట‌లిచ్చారు. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేస్తాం`` అన్నారు.
 
హీరోయిన్ అలేఖ్య మాట్లాడుతూ...`మా సినిమా ట్రైల‌ర్, ఈ రోజు విడుద‌లైన పాట‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments