Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ ట్రేడ్‌మార్క్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:49 IST)
Puneet Rajkumar
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ చిత్రంలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్‌ వస్తుండటంతో.. మేకర్స్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతోన్న ఈ చిత్రం కూడా అందరినీ అలరిస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 
 
పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.
 
పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్,
సంగీతం: చరణ్ రాజ్,
సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ,
ఆర్ట్: రవి శాంతేహైక్లు,
పీఆర్వో: బి. వీరబాబు
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్,
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
దర్శకత్వం: చేతన్ కుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments