Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోటి కపడా రొమాన్స్‌ టీమ్‌ను చూస్తుంటే ఈ నగరానికి ఏమైంది రోజులు గుర్తొస్తున్నాయి: విశ్వక్‌సేన్‌

డీవీ
మంగళవారం, 16 జులై 2024 (16:22 IST)
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
నిర్మాత సృజన్‌ కుమార్ బొజ్జం మట్లాడుతూ ఇటీవల ప్రివ్యూ వేశాం. సినిమా అందరికి బాగా నచ్చింది. సినిమాలో ఈ గలీజ్‌ సాంగ్‌ను చూసిన వాళ్లంతా ఈ సాంగ్‌ను విడుదల చేయమని కోరారు. అందరి కోరిక మేరకు ఈ రోజు విశ్వక్‌సేన్‌ చేతుల మీదుగా ఈ సాంగ్‌ను విడుదల చేశాం. తప్పకుండా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
 
నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ విశ్వక్‌ మాకు ఎప్పుడూ సపోర్ట్‌గా వుంటాడు. కొత్తవాళ్లను చాలా మందిని విశ్వక్‌ ఎంతో హెల్ప్‌ చేస్తున్నాడు. ఎదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే వుద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను తీశాం. దర్శకుడు విక్రమ్‌ రెడ్డి ఎంతో ప్రతిభావంతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల యూత్‌పీపుల్‌కు షో వేశాం. వాళ్ల ఫీడ్‌బ్యాక్‌తో మాలో మరింత కాన్ఫిడెంట్ వచ్చింది. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంది. రాహుల్‌ ఈ గలీజ్‌ సాంగ్‌ను ఎంతో బాగా పాడాడు విశ్వక్‌ సేన్‌ నాకు ఎంతో ఇనిస్పిరేషన్‌. ఎంతో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా కొత్త ప్రయోగాలు చేస్తూ సక్సెస్‌ అవుతుంటాడు. ఈ రోజు విశ్వక్‌ ఈ కార్యక్రమానికి వచ్చి సపోర్ట్‌ చేసినందుక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నా అన్నారు.
 
దర్శకుడు విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ 'సినిమా విజయంపై చాలా విశ్వాసంతో వున్నాం. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసే మనసు వుంది. అందుకే అతను ఈరోజు మంచి స్థాయిలో వున్నాడు. ఈ సినిమా లాంగ్‌ జర్నీ. సినిమా గురించి ఎలాంటి డౌట్‌ లేదు. తప్పకుండా హిట్‌ కొడుతున్నాం. అయితే ఏది ఏ రేంజ్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో వుంది. ఇదొక ఎమోషన్‌ల్‌ రైడ్‌. లవ్‌, ఎమోషన్‌ వుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ చిత్రంలో వుంటాయి.
 
విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ, నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు మంచి టేస్ట్‌ వుంది. లవ్‌స్టోరీస్‌ మీద మంచి జడ్డిమెంట్‌ వుంది. ప్రతి సినిమాను ఎంతో పాషన్‌తో నిర్మిస్తాడు. ఈ సినిమా టీమ్‌ను, హీరోలను చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది రోజులు గుర్తొస్తున్నాయి. హీరోలు, హీరోయిన్స్‌ చక్కగా వున్నారు. ఈ సినిమా విజయం సాధించి టీమ్‌ అందరికి మంచి పేరు తీసుకరావాలి. ఈ సినిమాను థియేటర్‌లో అందరూ చూడాలి. నిర్మాతలకు మంచి వసూళ్లు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments