Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

దేవి
సోమవారం, 3 మార్చి 2025 (16:25 IST)
Saptagiri
సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్' చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ గ్రూప్ కు చెందిన కె.వై. బాబు, థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. చాగంటి సినిమాటిక్ వరల్డ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) విడుదల చేస్తుంది. ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. 
 
‘‘ప్రసాద్‌ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాతముత్తాతలు ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా’’ అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్స్ తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. 
 
శాసనాల గ్రంథం ప్రకారం అతను పెళ్లి చేసుకోవడానికి కనీసం 2 కోట్ల రూపాయలు కట్నం తీసుకోవాలి - అంతకన్నా తక్కువ అయితే కుదరదు. మరో సవాల్ ఏమిటంటే, కట్నం నగదు రూపంలో చెల్లించాలి. ఇంత కఠినమైన పరిస్థితులలో సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ (శాశ్వత బ్రహ్మచారి) గా ఎప్పటికీ ఉంటాడా? పెళ్లి అవుతుందా? అనేది చాలా హిలేరియస్ గా ప్రజెంట్ చేశారు. 
 
సప్తగిరి తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో అలరించారు. 
 
సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. మధు ఎడిటర్‌.  
 
హ్యుమర్, సోషల్ కామెంటరీతో అలరించిన ఈ టీజర్ సినిమాపై అంచనాలని పెంచింది.  
 
తారాగణం: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments