రామ్ చరణ్, కియరా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుంచి జరగండి..(Jaragandi Song) సాంగ్ నేడు వచ్చేసింది. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ సాంగ్ కు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఓ కొండ ప్రాంతంలో నివసించే ఇళ్ళు, వాటన్నంటికీ కలర్ పుల్ రంగులు అద్ది వున్న ప్రాంతంలో నల్లటి రోడ్ మీద స్కూటర్ వేసుకుని వస్తుండగా పాట ఆరంభమవుతోంది.
kiyara, charan
అనంత శ్రీరామ్ రాసిన... జరగండి.. జరంగి.. జాబిలమ్మ జాకెటేసుకుని వచ్చెనండి...సిక్స్ ప్యాక్ లొో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ.. అంటూ పాటలోనే చిత్ర కథాసారాన్ని చెప్పినట్లుంగా వుంది. దలేర్ మెహందీ, సునిదిచౌహన్ ఆలపించారు. థమన్ బాణీలు సమకూర్చారు. ప్రభుదేవా స్టెప్ లు వేసే సన్నివేశాలు, చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు కూడా ఇందులో పాల్గొనడం, దర్శకుడు శంకర్ గైడెన్స్ ఇవ్వడం వంటివి ఈ పాటలో చూపించారు.
రామ్ చరణ్, కియారా ల నడుమ కెమిస్ట్రీని శంకర్ తన మార్క్ లో చిత్రీకరించారు.ఇక ఈ భారీ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య అలాగే సునీల్ తదితరులు నటిస్తున్నారు.