నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ఎక్స్ ట్రా. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోంది.
Extra 5m.. views
మ్యూజికల్ జీనియస్ హేరిష్ జయరాజ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మూవీ పోస్టర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. అందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారని, సినిమా షూటింగ్‌కు వచ్చిన వారిలో తనొక ఎక్స్‌ట్రా మెంబర్‌గా ఉంటారని అర్థమవుతోంది. దీంతో వావ్ అనిపించేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. నితిన్ పాత్ర ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయి. హేరిష్ జయరాజ్ సంగీతం ఆక్టటుకుంటోంది.
బాహుబలి 2 దండాలయ్యా... పాటలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఇది హిలేరియస్ ఉంది. శ్రీలీలతో హీరో లవ్ ట్రాక్, తండ్రైన రావు రమేష్‌తో హీరో నితిన్‌కి ఉండే సంఘర్షణ ఇవన్నీ టీజర్‌లో ఉన్నాయి. వక్కంతం వంశీ తనదైన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారని స్పష్టమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది. నితిన్ ఇప్పటి వరకు కనిపించని డిఫరెంట్ రోల్‌తో మెప్పించనున్నారు. నితిన్ తనదైన స్టైల్లో సునాయసంగా తన పాత్రను పోషించారు.
మ్యూజికల్ జీనియస్ హేరిస్ జయరాజ్ సంగీతం ఈ చిత్రాన్ని మరో పెద్ద ఎసెట్‌గా నిలవనుంది. రీసెంట్‌గా విడుదలైన డేంజర్ పిల్ల.. సాంగ్, అందులో నితిన్, శ్రీలీల పెర్ఫామెన్స్‌కు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. హేరిస్ కంపోజిషన్ నుంచి ఔట్ స్టాండింగ్ ట్యూన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.