కుక్క టైటిల్ పాత్ర‌లో ‘777 చార్లి’ టీజర్ విడుద‌ల చేసిన నాని

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:21 IST)
777 charli
`అతడే శ్రీమన్నారాయణ` చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 చార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు. ఆదివారం(జూన్‌6) నాడు ర‌క్షిత్ శెట్టి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమా తెలుగు టీజ‌ర్‌ను ఆదివారం నేచుర‌ల్ స్టార్ త‌న వాల్‌పోస్ట‌ర్ సినిమా యూ ట్యూబ్ ఛాన‌ల్‌లో విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 
 
టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే, ‘ఏంటో ఏమో ఎవ‌రెవ‌రో నిండిన దారుల్లో...’ అంటూ సాగే ఈ పాటను వినొచ్చు. మాంటేజ్ సాంగ్‌లో, కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా చార్లి అనే కుక్క ఓ ఇంటి నుంచి పారిపోయి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు అది ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. ధ‌ర్మ‌(ర‌క్షిత్ శెట్టి)ని ఎలా క‌లుసుకుంటుంది. వారిద్ద‌రూ క‌లుసుకున్న త‌ర్వాత ఏమ‌వుతుంది? అనే అంశాల‌ను ఎలివేట్ చేశారు. అలాగే ర‌క్షిత్ శెట్టి పోషించిన ధర్మ అనే క్యారెక్ట‌ర్‌ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. చార్లి, ధర్మ..ఇద్దరూ కలుసుకున్న తర్వాత వారెలాంటి సాహసం చేశారో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని, త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 
న‌టీన‌టులు:
ర‌క్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ రాజ్‌.కె
నిర్మాత‌లు: జి.ఎస్‌.గుప్తా, ర‌క్షిత్ శెట్టి
సంగీతం: నోబిన్ పాల్‌
సినిమాటోగ్ర‌ఫీ: అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌
ఎడిట‌ర్‌: ప్ర‌తీక్ శెట్టి
డైలాగ్స్‌: కిర‌ణ్ రాజ్.కె, రాజ్ బి.శెట్టి, అభిజీత్ మ‌హేశ్‌
స్టంట్స్‌: విక్ర‌మ్ మోర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: బినాయ్ కందేల్‌వాల్‌, సుధీ డి.ఎస్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments