Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మాట రాసుకోండి.. డెవిల్ సినిమా చాలా బావుంటుంది : నందమూరి కళ్యాణ్ రామ్

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (19:39 IST)
Nandamuri Kalyan Ram, Abhishek Nama,Samyukta Menon, Malavika Mohanan
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. 
 
ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని బింబిసార సమయంలో చెప్పాను. దాన్ని మీరు నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా డెవిల్ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో చూశారు. కథను తయారు చేసుకున్న శ్రీకాంత్, అద్బుతమైన విజువల్స్ అందించిన సౌందర్ రాజన్‌గారు, అలాగే వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, 1940 బ్యాక్ డ్రాప్ లో చేయాల్సిన ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేసిన గాంధీగారికి థాంక్స్. వీటన్నింటినీ కలిపి ఇలా చూస్తే బావుంటుందని ఆలోచించి ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను గొప్పగా రూపొందించిన అభిషేక్ నామాగారికి థాంక్స్. ఇలా అందరూ వెనకుండి మా ఆర్టిస్టులందరినీ నడిపించారు. సినిమా అనేది ఓ టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. డిసెంబర్ 29న డెవిల్ మీ ముందుకు వస్తుంది. నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా ఉంటుంది. బింబిసార 2ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ సినిమా దేవర గురించి చెప్పాలంటే.. RRR వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. త్వరలోనే గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. వి.ఎఫ్.ఎక్స్‌కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మేం దేవర మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే గ్లింప్స్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేస్తుంది.. డిసెంబర్ 29న డెవిల్ ను చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
 
రైటర్ శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ ‘‘కళ్యాణ్ రామ్‌గారు నాపై ఉంచని నమ్మకానికి, నాకు ఇచ్చిన సపోర్ట్‌కి చాలా థాంక్స్. అలాగే దర్శక నిర్మాత అభిషేక్ గారికి కూడా థాంక్స్. ఇంకా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌కి, ఎడిటర్ తమ్మిరాజుగారికి థాంక్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు గ్రేట్ మ్యూజిక్‌ను అందించారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
 
చిత్ర దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘డెవిల్ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమా చేయాలంటే, కథను నమ్మి హీరో ముందుకు రావాలంటే గొప్ప విషయం. రెండేళ్ల పాటు కళ్యాణ్ రామ్‌గారు మరో సినిమా ఏదీ చేయకుండా వర్క్ చేశారు. ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్‌గారిని చూసింది తక్కువ. రేపు థియేటర్స్‌లో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. యాక్షన్, పెర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇలాంటి పీరియాడిక్ మూవీ చేయాలంటే మంచి టీమ్ వర్క్ ఉండాలి. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌గారు, శ్రీకాంత్‌గారు, యాక్షన్ మాస్టర్ వెంకట్‌గారు ఇలా అందరూ రెండేళ్లు ఈ మూవీలో పార్ట్ అయ్యారు. ఈ ఏడాది వీరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్‌తో స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 29న డెవిల్ వంటి బ్లాక్ బస్టర్‌తో కంప్లీట్ అవుతుంది. సంయుక్తా మీనన్, మాళవికకు థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
 
మాళవికా మోహనన్ మాట్లాడుతూ ‘‘నటీనటులకు కొన్ని సినిమాలు అప్పటి వరకు ఉన్న ఇమేజ్‌ను బ్రేక్ చేస్తాయి. అలాంటి సినిమాలు అరుదుగా దొరుకుతుంటాయి. నాకు డెవిల్ సినిమా రూపంలో అలాంటి సినిమా దొరికింది. అభిషేక్‌గారికి థాంక్స్. శ్రీకాంత్‌గారు అద్భుతంగా నెరేట్ చేశారు. హర్ష సౌండ్ అదిరిపోయింది. కళ్యాణ్ రామ్‌గారితో నేను తొలిసారి పని చేశాను. అలాగే అవకాశం ఇచ్చిన అభిషేక్ నామాగారికి థాంక్స్. సౌందర్ రాజన్‌గారు ఎంటైర్ సినిమాకు పిల్లర్‌లాగా వర్క్ చేశారు. ఆయన సహా టీమ్ సపోర్ట్‌కి థాంక్స్’’ అన్నారు.
 
సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ‘‘డెవిల్ మూవీ కోసం ఎంటైర్ టీమ్ రెండేళ్ల పాటు ఎంతో కష్టపడింది. మంచి కథ, స్క్రిప్ట్‌తో సినిమా వస్తుంది. అభిషేక్ నామాకు థాంక్స్’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments