Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

దేవి
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (17:18 IST)
Manchu Manoj, Rayalaseema Bharat and team
రాయ‌ల‌సీమ‌ భరత్, ప్రీతి జంటగా న‌టిస్తున్న జగన్నాథ్' మూవీ టీజర్‌ను, పోస్ట‌ర్‌ను ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ రాక్‌స్టార్ మంచు మనోజ్‌ రిలీజ్‌ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఘ‌నంగా జ‌రిగిన‌ 'జగన్నాథ్' మూవీ టీజర్‌ లాంచ్ వేడుక‌లో జ‌బ‌ర్ద‌స్త్ కామెడియ‌న్స్ అప్ప‌రావు, వినోదిని, గ‌డ్డం న‌వీన్ పాల్గొని వినోదం పంచారు.
 
ఈ సంద‌ర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'జగన్నాథ్' మూవీ టీజ‌ర్ చాలా అద్భుతంగా ఉంది. త‌మ్ముడు 'రాయ‌ల‌సీమ' భర‌త్ చేసిన ఫ‌స్ట్ మూవీ అయిన‌ప్ప‌టికీ ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా చేశాడు. చిత్ర‌యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం క‌నిపిస్తోంది. భర‌త్ ఫ్రెండ్స్ అంతా ముందుకు వ‌చ్చి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవ‌డం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సినిమా తీయ‌డం అంత ఈజీ కాదు. అలాంటి ప‌రిస్థితుల్లో ఎంతో ఫ్యాష‌న్‌తో ఈ సినిమా తీశారు. కోటి రూపాయ‌ల‌తో తీసిన‌ సినిమా చిన్న‌ది, వెయ్యి కోట్ల‌తో తీసింది పెద్ద సినిమా అన‌డానికి లేదు. ఏదైనా సినిమానే. కాక‌పోతే, బాగుందా? బాగాలేదా? అనేదే ఉంటుంది. ఈ సినిమా 'జగన్నాథ్' మూవీ హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మూవీ టీం.'' అని అన్నారు.
 
హీరో రాయ‌ల‌సీమ‌ భరత్ మాట్లాడుతూ.. ''మంచు మనోజ్ అన్న మంచి మ‌నసున్న వ్య‌క్తి.  'జగన్నాథ్' మూవీ వేడుక కోసం ఆయ‌న స్వ‌చ్ఛందంగా వ‌చ్చారు. నిజంగా గ్రేట్ ప‌ర్స‌న్. సినిమాల మీద ఇష్టంతో ఎంతో క‌ష్ట‌ప‌డి ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నిరంత‌రం ప‌ని చేస్తూ 5 సంవ‌త్స‌రాల శ్ర‌మ‌తో 'జగన్నాథ్' మూవీని పూర్తి చేశాము. ఈ ఐదేళ్లు వెంకీ, చైతూ.. నా వెంటే ఉంటూ సొంత త‌మ్ముళ్ల మాదిరిగా క‌ష్టాలు పంచుకున్నారు. స‌పోర్టుగా నిలిచిన క‌దిరి భాష‌కు థ్యాంక్యూ. సినిమా బాగా వ‌చ్చింది.'' అని అన్నారు.
తారాగణం.. రాయ‌ల‌సీమ‌ భరత్ (హీరో), సారా, ప్రీతిరెడ్డి, నిత్య‌శ్రీ, పీలం పురుషోత్తం, దర్శకత్వం: భరత్, సంతోష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అశ్లీల వీడియోలు చూపించి సైకో భర్త టార్చర్.. భార్య సూసైడ్!!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు- పార్లమెంటరీ నియోజకవర్గాలకు జనసేన సమన్వయకర్తలు

Pawan Kalyan: పళనిలో పవన్ కల్యాణ్.. తిరుపతి-పళనికి బస్సు సర్వీసులు పునఃప్రారంభం (video)

Chittoor To Prayagraj- మహా కుంభమేళాకు సీఎన్‌జీ ఆటోలోనే వెళ్లిన ఏపీ యువకులు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments