ఇప్పుడు కాక ఇంకెప్పుడు, షార్ట్ టర్మ్ రిలేషన్ అమ్మాయి, నచ్చినంతవరకేననే అబ్బాయి

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:20 IST)
Ippdu kaka Inkeppdu teaser
ఇంటిప‌క్క‌నే కో-ఎడ్య‌కేష‌న్ స్కూల్లో చ‌దివితే కుర్రాడు చెడిపోతాడ‌ని, వాడి నాన్న ఊరికి దూరంగా వున్న మ‌గ‌వాళ్ళు చ‌దివే స్కూల్‌లో జాయిన్ చేస్తాడు. అమ్మాయిల‌వైపు క‌న్నెత్తి చూడ‌ను అంటూ  తండ్రి ఎదుట దేవుడి ప‌టాల‌పై ప్రామిస్ చేస్తాడు. క‌ట్ చేస్తే స్కూల్లో ఓ అమ్మాయికి లిప్ కిస్ ఇస్తాడు.
 
ఇదే విధంగా అబ్బాయిల‌తో ప‌ల్లెత్తు మాట్లాడ‌ను, అంటూ దేవుడి ఫొటోల ద‌గ్గ‌ర ప్రామిస్ చేస్తుంది ఓ అమ్మ‌యి. కానీ మాట త‌ప్పుతుంది. ఆ త‌ర్వాత కాలేజీ రోజుల్లో వీరి ఆలోచ‌న‌లు మారిపోతాయి. `నీ క‌ళ్ళు నాకు ఏదో చెప్పాల‌నుకుంటున్నాయి` అని అబ్బాయి అంటే.. నీతో షార్ట్‌ట‌ర్మ్ రిలేష‌న్ చెప్పాల‌నుంది అంటుంది అమ్మాయి. అయినా చాల‌ద‌న్న‌ట్లు, న‌చ్చినంత‌వ‌ర‌కు న‌చ్చి‌నంత‌గా ఎంజాయ్ చేయ‌డ‌మే.. అంటోంది అమ్మాయి.

ఓన్లీ ఎంజాయ్‌మెంట్ వ‌ర‌కే అయితే ప‌ర్లేదు.. అంటాడు అబ్బాయి. ఇదీ ఇప్ప‌టి యూత్ సినిమా. యూత్ కోస‌మే తీశామ‌ని, పైగా ఇది అంద‌రూ అనుకున్న‌ట్లు క‌ల్ట్ సినిమా కాద‌నీ, ఇది గోల్డ్‌లాంటి సినిమా అంటూ చెబుతున్నాడు. అంతేకాక ఇంట‌ర్‌వెల్‌లో క్లాప్స్ కొడ‌తార‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. పైగా క్ల‌యిమాక్స్‌లో క‌ళ్ళ‌ నీల్ళు పెట్టిస్తుంది అంటూ త‌న సినిమా గురించి చెప్ప‌కొచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

ఆ సినిమా పేరు `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. టైటిల్‌కు త‌గిన‌ట్లే వుంద‌ని టీజ‌ర్ చూసిన వారంతా కామెంట్ చేస్తున్నారు. ఒక‌టికాదు రెండు కాదు దాదాపు ప‌ది రొమాన్సు సీన్లు వున్నాయి. టీజ‌ర్‌లోనే ఇంత వుంటే సినిమాలో ఎంత వుంటుందో. అస‌లే ఒక ప‌క్క రాజ‌కీయ నాయ‌కుల బూతుల‌తో యువ‌త చెడిపోతుంటే, మ‌రోవైపు ఇలాంటి సినిమా తీసి స‌భ్య స‌మాజానికి ఏమి చెప్ప‌ద‌లిచార‌ని సినీ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ సినిమాకు యుగంధ‌ర్ ద‌ర్శ‌కుడు, గోపాల‌క‌ష్ణ‌రెడ్డి నిర్మాత‌. మ‌రి ఈ సినిమాకు సెన్సార్ వారు ఏమంటారో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments