Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ ఆవిష్కరించిన కన్యాకుమారి టీజర్

డీవీ
మంగళవారం, 9 జనవరి 2024 (12:47 IST)
Geet Saini
ఆనంద్ దేవరకొండ హీరోగా "పుష్పక విమానం" సినిమా రూపొందించి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దామోదర. ఆయన ప్రస్తుతం రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా "కన్యాకుమారి" సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. "కన్యాకుమారి" టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని ప్రశంసించిన విజయ్ దేవరకొండ, "కన్యాకుమారి" మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ తెలియజేశారు.
 
తను అనుకున్న విషయాన్ని మొహం మీదే చెప్పేసే శ్రీకాకుళం అమ్మాయి కన్యాకుమారి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని 'నీది విగ్గు కదా..! అని అడిగే బెరుకులేని యువతి. కన్యాకుమారి అందానికి ఊర్లో అబ్బాయిలు వెంటపడితే చెంప చెళ్లుమనిపిస్తుంటుంది. ఈ పిల్లకు పొగరు అని అనుకున్నా పట్టించుకోదు. కన్యాకుమారి డిగ్రీ చదివినా...చీరల కొట్టులో పని చేయాల్సివస్తుంది. కన్యాకుమారి క్యారెక్టర్ లో గీత్ సైని పర్ ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా ఉంది. శ్రీచరణ్ రాచకొండకు కూడా మంచి డెబ్యూ మూవీ కానుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో "పుష్పక విమానం" సినిమాను రూపొందించిన దర్శకుడు దామోదర తన సెకండ్ ప్రాజెక్ట్ తో మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించినట్లు టీజర్ తో తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక "కన్యాకుమారి" సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments