Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినూత్నమైన కథతో రూపొందిన మాయా - ప్రీ రేలీజ్ లో దర్శకనిర్మాతలు

డీవీ
మంగళవారం, 5 మార్చి 2024 (16:36 IST)
Esther Noranha, Kiran Avala, rajesh and others
ఎస్తర్ నోరన్హా, కిరణ్ ఆవల, సిరిచందన, టార్జాన్ తదితరులు నడిచిన సినిమా మాయ. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని తాజా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
 
ఎస్తర్ నోర్హణ మాట్లాడుతూ.. చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి కానీ, చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండవని పేర్కొన్నారు. మనం తెరక్కకిచ్చే సినిమా మనకు ఎప్పుడూ పెద్దదే అని తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ రమేష్ కాన్ఫిడెన్స్ నన్ను ఈ సినిమాను చేసేలా చేసిందన్నారు. ఇది క్రైమ్ స్టోరీ అయినప్పటికీ సినిమాలో ఎమోషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరారు.
 
డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు, మూవీ స్క్రీన్ ప్లే విన్న వెంటనే సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మినట్లు హీరో కిరణ్ ఆవల వెల్లడించారు. సినిమా ప్రివ్యూ వేసినప్పుడు తన నమ్మకం నిజమైందని తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టి కొట్టాడు అని కొనియాడారు. కిరణ్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ కూడా వీళ్ళకే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మూవీని ప్రోత్సహించడానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సత్యం రాజేష్, అనుదీప్ చౌదరి ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాయ చిత్రం నిర్మాత రాజేష్ ఎంతో ఉత్సాహంతో అలాగే నమ్మకంతో పెట్టుబడి పెట్టారని తెలిపారు. నేడు ప్రేక్షకుడు టెక్నికల్ గా చాలా అడ్వాన్స్బుగా ఆలోచిస్తున్నాడని అందుకనే పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా మాయా చిత్రం ఉంటుందని కిరణ్ ఆవల తెలిపారు.
 
నిర్మాత రాజేష్ గురిజవోలు మాట్లాడుతూ.. రమేష్ మొదట ఈ కథను చెప్పినప్పుడు ఇలాంటి కథ ఖచ్చితంగా మెటీరియలైజ్డ్ కావాలని.. బడ్జెట్ గురించి ఆలోచించకండి అని చెప్పానన్నారు. తర్వాత ఈ ప్రాజెక్టులోకి హీరోయిన్ ఎస్తర్ రావడం ప్రధాన బలం అన్నారు. ఆ తర్వాత ఎంతో అనుభవం ఉన్న సురేష్ కొండేటి చేరడం అదనపు బలం అన్నారు. వీటన్నింటికీ మించి డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాయా సినిమాను తీసుకోవడం అనేది ఒక విజయం అని నిర్మాత రాజేష్ పేర్కొన్నారు.
 
మాయా చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్ రాజేష్ అని డైరెక్టర్ రమేష్ పేర్కొన్నారు. సినిమా మొదటి నుంచి పోస్టు ప్రొడక్షన్ అయ్యేవరకు ప్రతి క్షణాన్ని ప్రోత్సహిస్తూ డబ్బుల గురించి ఆలోచించకండి బాగా తీయండి అన్న వ్యక్తి మా ప్రొడ్యూసర్ అని తెలిపారు. సినిమా ఎంత బాగా చేసినా డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు ముందుకొచ్చి సినిమాను తీసుకోవడంతో విడుదలకు ముందే విజయం సాధించినట్టు అయిందని వెల్లడించారు. అలాగే కథ విన్న వెంటనే నేను చేస్తున్నా అని ముందుకొచ్చిన హీరోయిన్ ఎస్తర్ నోర్హానా మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అని అన్నారు. హీరో సత్యం రాజేష్ తో పెద్దగా పరిచయం లేనప్పటికీ, కలిసిన వెంటనే నేనున్నాను.. మీకు సపోర్ట్ చేస్తాను అని భరోసానిచ్చిన మంచి మనసున్న వ్యక్తి అని డైరెక్టర్ తెలిపారు.చిత్రాన్ని తెరకెక్కించడంలో టీం ఎంతో సపోర్ట్ చేసిందని డైరెక్టర్ రమేష్ నాని తెలిపారు. సినిమాకు పెద్ద బ్యాక్ బోన్ అని అన్నారు.
 
బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు తన వంతు సాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. హీరోయిన్ ఎస్తర్ తో ఉన్న పరిచయంతోనే ఈ ఈవెంట్ కు వచ్చినట్లు.. చిన్న సినిమా అయినా అద్భుతమైన కంటెంట్ ను అందించారని మాయ టీంను కొనియాడారు.
 
మాయ చిత్రాన్ని చిన్న సినిమా అంటున్నారు కానీ నిజానికి ఆ తేడా ఏమీ ఉండదు కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఒకే రకమైన విజయాన్ని అందుకుంటుందని నటుడు హీరో సత్యం రాజేష్ పేర్కొన్నారు. సినిమా కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి తెరకెక్కించారని టీజర్, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుందన్నారు. ఫిలిం క్రిటిక్ సురేష్ కొండేటి ఈ సినిమాలో తన పాత్రను కొట్టేసాడని కితకితలు పెట్టారు. సినిమాకి మెయిన్ పిల్లర్ ఎస్తర్ నోర్హణ అని తనతో వెయ్యి అబద్ధాలు, భీమవరం బుల్లోడు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ను పంచుకున్నారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో లంచ్ బ్రేక్ లో టైం వేస్ట్ కాకుండా లొకేషన్ లోనే ఉంటూ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన కమిట్మెంట్ యాక్టర్ తను అని కొనియాడారు. మెయిన్ లీడ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు అని అడిగినప్పుడు.. ఏదైనా పాత్రే కదా ఇండస్ట్రీలోనే ఉన్నాము, ఇక్కడే చివరి వరకు ఉండాలి అని చెప్పిన అద్భుతమైన నటి అని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపినీడు ఈ సినిమాని తీసుకోవడం శుభపరిణామం అని సత్యం రాజేష్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?

పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...

ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments