Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈగెల్ ట్రైలర్ లో ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు అంటోన్న రవితేజ

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (18:25 IST)
raviteja motubari
మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండూ రవితేజను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు లాంచ్  చేశారు. ట్రైలర్ ఎలా ఉందంటే.. 
 
పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, నక్సలైట్లకు కూడా మోస్ట్ వాంటెడ్ అయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో వున్న అనుపమ పరమేశ్వరన్, నవదీప్ తో సీరియస్ గా మాట్లాడుతున్న సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. “తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా... అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు...” అని నవదీప్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని మరింతగా పెంచింది.
 
అతను ఒక మిషన్‌లో ఉన్న క్రూరమైన హంతకుడు. అతను టర్కీ, జర్మనీ, జపాన్‌లో లావాదేవీలు జరిపిన వ్యక్తి. అతను దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాడు. అతని కథ గత 10 సంవత్సరాలలో బిగ్గెస్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. ఇదంతా రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించిన హీరో రవితేజ గురించి. తనకి కావ్య థాపర్ పాత్ర రూపంలో ఒక గర్ల్ ఫ్రండ్ వుంది. ఆమె తుపాకీలను ద్వేషిస్తుంది, బుల్లెట్లకు భయపడుతుంది కానీ ఆమె జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకుంటుంది.
 
'ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు... ఆయుధంతో విధ్వంసం ఆపే వాడు దేవుడు... ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు ’’ అంటూ ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పిన డైలాగ్స్ గూజ్ బంప్స్ తెప్పించాయి.
 
యాక్షన్, డ్రామా, లవ్, ఎమోషన్‌తో ట్రైలర్ ప్యాక్డ్ గా వుంది. ఇంతకుముందు విజయవంతమైన కార్తికేయ2 చిత్రానికి రాసిన మణిబాబు కరణం పవర్ ఫుల్ డైలాగ్‌లు రాశారు. కార్తీక్ ఘట్టమనేని లార్జర్ దెన్ లైఫ్ కథతో రవితేజను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. టేకింగ్ టాప్ క్లాస్. కార్తీక్ ఈ సినిమా ఎడిటర్, మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
 
రవితేజ రెండు విభిన్నమైన గెటప్‌లలో వైవిధ్యం చూపించారు. అతను క్లీన్ షేవ్ లుక్‌లో లవర్‌బాయ్‌గా కనిపిస్తుండగా, గడ్డం, పొడవాటి జుట్టుతో  వైల్డ్, రగ్గడ్ గా కనిపించారు. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ క్యారెక్టర్‌కి ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. నిజంగానే మాస్ విశ్వరూపం చూపించారు. కావ్య థాపర్ రవితేజ లేడీ లవ్‌గా నటించగా, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో కనిపించింది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర ముఖ్య పాత్రలలో ఆకట్టుకున్నారు.
 
కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాల సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, దావ్‌జాంద్ చేసిన అద్భుతమైన స్కోర్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణ విలువలు అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. ట్రైలర్ అంచనాలని అందుకొని  సినిమా చూడాలనే ఉత్కంఠ రెట్టింపు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments