పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. ఎందుకో అందరూ ఆచార్య అంటారు.. (టీజర్)

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (16:49 IST)
మెగాస్టార్ చిరంజీవిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదలైంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
"ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి" అంటూ కొణిదెల ప్రొ కంపెనీ ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక.
 
"ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం... అలాంటి వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు" అంటూ సాగే డైలాగుతో టీజర్ మొదలవుతుంది. 
 
అంతేకాదు, తనను 'ఆచార్య' అనడం వెనుకున్న కాన్సెప్ట్‌ను‌ కూడా చిరంజీవి వెల్లడించడం ఈ టీజర్‌లో చూడొచ్చు. పాఠాలు చెప్పే అనుభవం లేకపోయినా అందరూ నన్ను ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా.. గుణపాఠాలు చెబుతానని కాబోలు అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 
 
కాగా, ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు. అలాగే, రామ్ చరణ్ కూడా సిద్ధూ అనే పాత్రలో కనిపించనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments