Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

డీవీ
గురువారం, 19 డిశెంబరు 2024 (16:15 IST)
Chandrahas, VVVinayak, and team
చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే "బరాబర్ ప్రేమిస్తా " సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ "బరాబర్ ప్రేమిస్తా " సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 
 
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ - నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా "బరాబర్ ప్రేమిస్తా"తో మీ ముందుకు రాబోతోంది. నేను హీరోగా నటించడానికి కారణం మా డీవోపీ శేఖర్. ఆయన నా బ్లాక్ డాగ్ వైట్ చిక్ సినిమా టీజర్ చూసి ఈ టీమ్ కు పరిచయం చేశారు. "బరాబర్ ప్రేమిస్తా " టీజర్ ఇన్ స్టంట్ గా మీ అందరికీ నచ్చింది. మీరు వన్స్ మోర్ అనడం చూస్తుంటే ఆ విషయం తెలుస్తోంది. మా టీజర్ తప్పకుండా వైరల్ అవుతుంది. మా సినిమాకు ద్రువన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్  గా ఉంటుంది. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుందని చెప్పగలను. "బరాబర్ ప్రేమిస్తా " సినిమాకు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
 
 యాక్టర్ అర్జున్ మహి మాట్లాడుతూ - 2018లో ఇష్టంగా సినిమాతో మీ ముందుకు వచ్చాను. చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాను. మా మూవీకి మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ, గతంలో ఇష్టంగా, ఏక్ అనే చిత్రాలు చేశాను. మంచి ప్రయత్నంగా ఆ సినిమాలకు పేరు వచ్చింది. ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరి చేయాలని అనుకుని "బరాబర్ ప్రేమిస్తా " ప్రారంభించాం. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా మా సినిమా ఉంటుంది. కాస్ట్ అండ్ క్రూ మాకు బాగా సపోర్ట్ చేశారు. "బరాబర్ ప్రేమిస్తా " సినిమా గురించి మరిన్ని వివరాలు ట్రైలర్ లాంఛ్, ఇతర ఈవెంట్స్ లో చెబుతాను అన్నారు.
 
హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ,  ఈ సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు థియేటర్స్ లోకి వస్తాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నా అన్నారు.
 
 నిర్మాత చిన్ని గాయత్రి మాట్లాడుతూ, సినిమా కథ వినగానే నచ్చి నా ఫ్రెండ్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేశాను. సినిమా బాగా రావాలని డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి క్వాలిటీతో మూవీ చేశాం. "బరాబర్ ప్రేమిస్తా " సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments