Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ‌ర్మ‌స్థ‌లిని అధ‌ర్మ స్థ‌లిగా మారిస్తే అమ్మ ఆవ‌హిస్తుంద‌ని చెప్పే ఆచార్య ట్రైల‌ర్‌

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (18:39 IST)
Acharya new poster
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన  `ఆచార్య‌` చిత్రం ట్రైల‌ర్ ఈ సాయంత్రమే విడుద‌లైంది. ధ‌ర్మ‌స్థ‌లికి ఆచార్య ఓ బాగువేసుకుని వ‌చ్చే పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పై భాగంలో రామ్‌చ‌ర‌న్ యాక్ష‌న్ చేస్తున్న అంశాన్ని చూపించారు. ఇక ట్రైల‌ర్లో చూస్తే, ఇది మెగా అభిమానుల‌ను అల‌రించేదిగా వుంది.
 
దివ్య వ‌నం ఒక‌వైపు తీర్థ జ‌లం మ‌రోవైపు, న‌డుమ పాద‌ఘ‌ట్టం అంటూ రామ్‌చ‌ర‌న్ వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మవుతుంది. ఇక్క‌డ అంద‌రూ సౌమ్యులు. పూజాలు, పున‌స్కారాలేకాదు. ఆప‌దొస్తే అమ్మోరు త‌ల్లి మాలో ఆవ‌హించి ముందుకు పంపుతుందంటూ.. అదే ధ‌ర్మ‌స్థ‌లి.. అనే డైలాగ్ రావ‌డం. ఆ త‌ర్వాత యాక్ష‌న్ సీన్స్ ఎక్కువ‌గా చూపించారు. దీనిని బ‌ట్టి ఇది యాక్ష‌న్ చిత్రంగా గోచ‌ర‌మ‌వుతుంది.
 
కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా  ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్ని ఎంటర్ టైన్మెంట్ పతాకాల పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇప్ప‌టికే చిరంజీవి 153వ చిత్రంగా 153 థియేట‌ర్ల‌లో ఈ ట్రైల‌ర్ విడుద‌లైంది.  చిరంజీవి, రామ్ చరణ్ డైలాగ్స్ ట్రైలర్‌లో ఆకట్టుకోగా, సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. . ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా  విడుద‌ల కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అల్లు అర్జున్ పైన ఆ కేసుతో 10 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments