Webdunia - Bharat's app for daily news and videos

Install App

భిన్న‌మైన స్క్రీన్ ప్లే తో పులి వచ్చింది మేక సచ్చింది

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:50 IST)
puli vachindi meka chachindi
ఒక భిన్న‌మైన క‌థ‌తో అంతే భిన్న‌మైన టైటిల్‌తో వ‌చ్చిన సినిమా ‘పులి వచ్చింది మేక సచ్చింది’. ప్రస్థానం మార్క్స్ పతాకంపై  భవానీ శంకర్ కొండోజు చిత్రాన్ని నిర్మించారు. జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
రాబర్ట్ (చిత్రం శీను), అరుణకుమారి (నిహారిక రెడ్డి) అన్యోన్య దంప‌తులు. వీరికి యోగి(వాసుదేవ్) వైశాలి (వర్ష ), మను అనే ముగ్గురు సంతానం. వీరిది ప్రేమ ఆప్యాయతలతో వర్ధిల్లే ఓ అందమైన కుటుంబం. ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమ. అయితే సంతానంలో చివరి వాడైన మనుని  ఉన్నట్టుండి ఆ బాలుడి తల్లిదండ్రులు, మిగతా వారు అన్న యోగి, అక్క వైశాలి చంపాలని వివిధ రకాలుగా ప్లాన్ వేస్తుంటారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా మను తల్లి అరుణ, తండ్రి రాబర్ట్ వాళ్ళ ఇంట్లోనే చనిపోయి విగత జీవులుగా పడి వుంటారు. మరి మనుని చంపాలనుకున్న వీరు ఎలా చనిపోయారు? అంత ప్రేమగా వుండే కుటుంబ సభ్యులు అసలు మనుని ఎందుకు చంపాలనుకున్నారు? అందుకు కారణం ఏంటి? మిగతా కుటుంబ సభ్యులు యోగి, వైశాలి ఏమయ్యారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
 విశ్లేషణ: పులి వచ్చింది మేక సచ్చింది… ఈ సినిమాలో పులి ఎవరో చెబితే ప్రేక్షకులకు రూ.10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించి… ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు చిత్ర దర్శకుడు ఆ.రాజశేఖర్ యాదవ్. ఇదొక సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు… తన స్నేహితుడైన కరుడుగట్టిన నేరస్తుడికి మధ్య జరిగే కథ ఇది. ఇందులో దర్శకుడు కథ సింపుల్ ప్లాట్ మీదే రాసుకున్నా… కథనాన్ని మాత్రం కొత్తగా రాసుకున్నారు. రెండు పార్టుల సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఎక్కడా రెండు పార్టుల మూవీగా అనిపించదు. ఫస్ట్ పార్ట్ కథకు ప్రేక్షకులు బాగా థ్రిల్ అవుతారు. ముగింపు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 
 
రెండో పార్ట్ కంటిన్యూటీ కోసం కథను మధ్యలోనే ఆపేసి డిస్ట్రబ్ చేసినట్లు అనిపించదు. రెండో భాగానికి కంటిన్యుటీలాగే ఉంటుంది. ఇదొక సస్పెన్స్ క్రైమ్ డ్రామా కాబట్టి… ఇందులో కథనం ఏదో కొత్తగా చెప్పాలనే ఉద్దేశంతో దర్శకుడు ఎలాంటి కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే రాయలేదు. సినిమాలో కథనం కొత్తగా ఉంటూ… స్ట్రెయిట్ గా వుంటూ ప్రేక్షకులకు సులువుగా అర్థమవుతుంది. సినిమా మొదలయినప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు… విరామం లేకుండా సస్పెన్స్ క్రైమ్ డ్రామా ఆడియన్స్ ని అలరిస్తుంది.
 
ఓ వైపు సాఫ్ట్ గా కనిపిస్తూనే… మరోవైపు క్రూఎల్ మెంటాలిటీ ఉన్న స్త్రీ లోలునిగా వ్యసనపరుడైన తండ్రి పాత్రలో రాబర్ట్ గా  చిత్రం శీను అలరించాడు. అతని భార్యగా నటించిన నీహారిక రెడ్డి కూడా వ్యసన పరురాలిగా… తన అంద చందాలతో నటించి మెప్పించింది. వీరి పిల్లలుగా నటించిన వర్ష వికలాంగురాలుగా… వాసుదేవ్ తమ్ముడిని చంపాలనుకునే కన్నింగ్ అన్నగా నటించారు. ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాండా పాత్రలో (ఆనంద్ భారతి), IAS పాత్రలో మంచి స్నేహితుల పాత్రలో నటించారు.
 
- ప‌లు క‌ష్టాలు ఎదుర్కొని చిత్ర దర్శకుడు ఆ.రాజశేఖర్ యాదవ్ ఈ మూవీని తన స్నేహితుల సహకారంతో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రపంచపు తొలి 360 డిగ్రీల స్క్రీన్ ప్లే మూవీగా తెరకెక్కించి  ప్రేక్షకుల్లో మంచి క్యూరియసిటీని పెంచారు. దర్శకుడు రాసుకున్న కథ… కథనాలు ఆసక్తిగా ఉన్నాయి. సస్పెన్స్ క్రైమ్ డ్రామాని సక్సెస్ ఫుల్ గా రన్ చేయగలిగారు. ఎక్కడా డీవియేట్ కాకుండా తను రాసుకున్న కథ… కథనాలను స్ట్రెయిట్ గా స్క్రీన్ పై ఆవిష్కరించారు. నేప‌థ్య సంగీతం కాస్త ఎక్కువ‌యింది. కొన్ని చోట్ల అన‌వ‌స‌ర‌పు రొద‌లు వున్నాయి. వాటిని త‌గ్గించుకుంటే బాగుండేది. క‌థ‌కు తగ్గట్టే నిర్మాణ విలువలు ఉన్నాయి. 
 
రేటింగ్: 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments