Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు మెచ్చే 'టామీ'... తనలాంటి వారి కోసమేనా...? రివ్యూ రిపోర్ట్

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2015 (18:28 IST)
టామీ నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, సీత, టామి(కుక్క), ఇంకా తదితరులు, నిర్మాత: హరిరామజోగయ్య, సంగీతం: చక్రి, దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి. 
 
సినిమా కథకు అనుగుణంగా మూగజీవాలను ఏదో ఒకటి రెండు సందర్భాల్లో వుపయోగించుకోవడం మామూలే. కానీ పూర్తిస్థాయిలో కుక్క చేత నటింపచేసి ప్రేక్షకులను మెప్పించాలనుకోవడం చాలా సాహసం. ఇందుకు అభిరుచిగల నిర్మాత కావాలి. నటనాపరంగా ఆ టేస్ట్‌ వున్న కథానాయకుడు కావాలి. అందుకే గతంలో పలు చిత్రాలు తీసిన హరిరామజోగయ్య ఈ చిత్రాన్ని నిర్మించాడు. దీనిద్వారా ఓ సందేశం కూడా చెప్పదలిచాడు. అదేమిటో చూద్దాం.

 
కథ: 
విశ్వం మాస్టారు(రాజేంద్రప్రసాద్‌) భీమవరంలో బాగా పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌. నర్సాపురం నుంచి భీమవరం రైలులో ప్రయాణం అతని దినచర్య. ఓ రోజు స్టేషన్లో ఓ కుక్కపిల్ల అతని వెంటపడుతుంది. దాన్ని ఎక్కడ వదిలినా అతని వెంటే పడుతుంది. భార్య అన్నపూర్ణ(సీత)కు ఇష్టం లేకపోయినా.. కూతురు, భర్త కోరిక మేరకు దానిని పెంచుకునేందుకు ఒప్పుకుంటుంది. క్రమేణా కొడుకు లేని లోటు తీర్చేదిగా కుక్కపిల్లను విశ్వం భావిస్తాడు. దానిపై మమకారం ఎక్కువవుతుంది. ఓ రోజు అనుకోని విధంగా విశ్వం మరణిస్తాడు. ఆ విషయం తెలియక.. రోజూ తన యజమాని కోసం స్టేషన్‌ దగ్గరే ఎదురుచూస్తూ వుంటుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది ముగింపు.
 
విశ్లేషణ.. 
ఇటువంటి చిత్రంలో కథ చాలా సింపుల్‌గా వుంటుంది. ట్రీట్‌మెంట్‌లోనే ప్రత్యేకత చూపించాల్సి వుంటుంది. కుక్క, యజమాని సంబంధాలు కుక్కలు పెంచేవారికి తెలుస్తుంది. చాలామంది విదేశాల్లో కుక్కలకు ఆస్తులు కూడా రాసి పెడుతుంటారు. అయితే అంతలేదు కానీ... ఓ చోట జరిగిన యదార్థ సంఘటనను నిర్మాత సినిమాగా మలిచాడు. హాలీవుడ్‌లో 'హ్యాచీ.. ఏ డాగ్‌ టేల్‌' అనే సినిమా ఆరేళ్ళనాడు వచ్చింది. దానికి స్పూర్తిగా ఈ చిత్రాన్ని నిర్మాత తీసుకున్నాడు. 
 
నటుడిగా రాజేంద్రప్రసాద్‌ ఈజీగానే చేసేశాడు. టామి చేత చేయించడం శిక్షకుడి వల్లే అవుతుంది. సినిమాలో బాగానే నటించింది. ఇటువంటి కథలు నెరేషన్‌ చాలా స్లోగా వుంటాయి. మొదటి భాగం నుంచి చివరి వరకు కూర్చోవడం చాలా ఓపిక వుండాలి. కథనంలో రకరకాలుగా దర్శకుడు చూపించాడు కానీ మానవత్వం అనే పాయింట్‌ను తీసుకుని దానిమీద కూర్చోపెట్టాలనుకోవడం సాహసమే.. కుక్కను మనిషిగా ట్రీట్‌ చేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే. వారికే ఇందులో అంశాలు నచ్చుతాయి. ఎమోషన్స్‌, సున్నితమైన ధోరణులు ఓ దశలో విసుగుపుట్టిస్తాయి. మొదటి భాగం సోసోగా సాగుతుంది. రెండో భాగంలో ఎమోషన్స్‌ పండించడానికి కష్టపడ్డాడు దర్శకుడు. 
 
పాత్రధారులు బాగానే న్యాయం చేశారు. కానీ చెప్పే విధానంలో ఇంకా ఆసక్తిని కల్పించే మరిన్ని అంశాలు ఇందులో వుంటే బాగుండేది. మనిషి, కుక్క ఏది విశ్వాసం అనే లాజిక్కుతో ఈ సినిమాను తీశారు. ఎన్ని నీతులు చెప్పినా.. ఇటువంటి చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటాయనేది అడియాసే అవుతుంది. కేవలం తనలాంటి వారికోసమే నిర్మాత తీసినట్లుంది. ఇటువంటి చిత్రం చిన్నపిల్లలకు కొంత మేరకు నచ్చవచ్చు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments